45వేల దిగువకు బంగారం… రూ.1800 తగ్గిన వెండి…
దిల్లీ: దేశంలో గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర మంగళవారం భారీగా దిగొచ్చింది. ఇవాళ ఒక్కరోజే రూ. 679 తగ్గి రూ. 45వేల మార్క్ కిందకు చేరుకుంది. దేశ రాజధాని దిల్లీలో నేడు 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 44,760గా ఉంది. అటు వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. ఏకంగా రూ. 1847 తగ్గడంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 67,073 పలికింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు దిగొచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.
అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 1,719 డాలర్లు, ఔన్సు వెండి ధర 26.08గా ఉంది.