కంబదూరులో మామిడి ,చింతచెట్లకు నిప్పంటించిన దుండగులు
అనంతపురం జిల్లా :- కంబదూరు మండల కేంద్రంలో తలారి యర్రిస్వామి అనే ఓ రైతు పొలంలో 200 మామిడి చెట్లకు 150 చింతచెట్లకు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన కంబదూరు లో చోటు చేసుకుంది.
ఈ ఘటనలో మామిడి చెట్లు ,చింత చెట్లు మరియు డ్రిప్ పూర్ధిగా దగ్ధమై సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని రైతు కన్నీరుమున్నీరు అయ్యాడు.
నిప్పంటించిన గుర్తితెలియని దుండగులను పోలీసు వారు గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేసాడు.