ఇద్దరు వ్యక్తుల నుండి బంగారు ఆభరణాలు స్వాధీనం. …
ఇద్దరు వ్యక్తుల నుండి బంగారు ఆభరణాలు స్వాధీనం. … కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.
• స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 1,012.845 గ్రాములు, దీని విలువ 55 లక్షల 71 వేల 6 వందల 63 రూపాయలు.
కర్నూలు, ఏప్రిల్ 10 . హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో హెడ్ ఆఫీస్ PMJ జేమ్స్ & జ్యూవెలర్స్ చెందిన Sales Executives/ logistics dept( కొప్పెర శ్రీకాంత్ (45), కొప్పెర నరసింగరావు (50) లు కుషాల్ జైన్ ఓనర్ ఆదేశాల మేరకు కర్నూలు వెంకటరమణ కాలనీలోని PMJ జేమ్స్ & జ్యూవెలర్స్ కు 55 చిన్న చిన్న బంగారు ఆభరణాలను తీసుకొని ( బంగారం బరువు 1,012.845 గ్రాములు, దీని విలువ 55 లక్షల 71 వేల 6 వందల 63 రూపాయలు) వస్తుండంగా పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ సిఐ లక్ష్మీదుర్గయ్య మరియు తమ సిబ్బంది, లోకల్ పోలీసులు ఏప్రిల్ 9 వ తేది మద్యాహ్నం తనిఖీలలో బంగారంకు సంబంధించిన పొందుపరచిన బిల్లులు సరిపడ లేనందున స్వాధీనం సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయంపై కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ క్రైమ్ నెంబర్ 297/2021 U/S … 102 CRPC క్రింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు విలేకరుల సమావేశం నిర్వహించారు. వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న బంగారం ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వారికి అప్పగిస్తున్నామన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్ గారు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మహేశ్వరరెడ్డి, కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్, కర్నూలు సెబ్ సిఐ లక్ష్మీ దుర్గయ్య, కర్నూలు తాలుకా సిఐ విక్రమసింహా, ఎస్సై ఖాజా వళి ఉన్నారు.