సనాతన ధర్మం శరవేగంగా పెరుగుతున్న దేశం ఏది ??


భారత దేశం కాదు ,నేపాల్ అంతకన్నా కాదు రోజు రోజు కి కొత్త కొత్త వాళ్ళు సనాతన ధర్మం ఆచరిస్తున్న దేశం ఆఫ్రికా లో, ఘన దేశం లో లాగా శివుడికి ప్రదోషకాలంలో పూజలు నిర్వహించే వారు ఇక్కడ కూడా కనిపిస్తారు అక్కడ స్థానిక నల్ల జాతి ప్రజలు కాషాయం ధరించిన సన్యాసులు విభూతి పెట్టుకున్న స్థానికులు ఎక్కడ చుసిన భగవన్నామ స్మరణతో మారు మోగిపోతుంది . చీరలు ధరించిన ఆడవాళ్లు పంచలు కట్టుకున్న మగవాళ్లు కనిపిస్తారు అక్కడికి వెళ్తే నిజంగానే సత్య యుగంలో ఉన్నామా, త్రేతా యుగంలో ఉన్నామా! అన్న భావన కలుగుతుంది స్తోత్ర పఠన వేదాలు ,మంత్రోచ్చరణతో హోమాలు హవానాలు , గణపతి ,దుర్గ శివ పూజలతో అతి వేగంగా మన సనాతన ధర్మ పరులు పెరుగుతున్నారు.

దేశ విభజన జరిగిన తర్వాత ,సింద్ ప్రాంతం నుండి పారిపోయిన కొంతమంది సింధు ప్రజలు ఘన దేశం కి వెళ్లారు వీళ్ళ నుండి అక్కడ స్థానిక ప్రజలు మన ధర్మం గురించి కొద్దీ కొద్దిగా తెలుసుకొని సనాతన ధర్మంలోకి మారుతున్నారు ఒక ఆఫ్రికన్ మన హిందూ ధర్మం గురించి అధ్యనం చేసి స్థానిక ప్రజల్లో ధర్మం గురించి చెప్పడం ప్రారంబించాడు . కొంత కాలం తర్వాత అక్కడ ఉన్న సింధులను కలవడానికి భారత దేశం నుండి ఒక స్వామిజి వెళ్లారు ఆయన పేరు స్వామి కృషానంద .అక్కడ ఆఫ్రికన్ మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడని తెలుసుకొని ఆయన్ని కలవడానికి వెళ్లి ఆ ఆఫ్రికన్ వ్యక్తి ని రిషికేష్ తీసుకెళ్లారు స్వామిజి .చాల కాలం రిషికేష్ లో ఉన్న ఆ ఆఫ్రికన్ వ్యక్తి సన్యాసం తీసుకొని జీవితమంతా సన్యాసిగా సనాతన ధర్మం కోసం పని చేస్తా అని ప్రతిజ్ఞ చేసారు . ఈయన పేరు స్వామి గణనంద దేశం పేరు ఘన అందుకే గణనంద గా పిలిచేవారు . తర్వాత అయన తన సొంత దేశానికి వచ్చి సనాతన ధర్మ ప్రచారాన్ని ప్రారంభించారు
అనేక మఠాలు స్థాపించారు ఆఫ్రికన్ హిందూ సొసయిటీ ఏర్పాటు చేసారు . ఐదు దేవాలయాల్ని స్థాపించారు అనేక మంది ని సనాతనులుగా మార్చారు వాళ్లందరికీ పట్టుదలతో మనకంటే బాగా మన పద్దతులు ఆచారాలు నేర్పించారు .ఇయన కాలం చేసిన తర్వాత స్వామి సత్యానంద, ఈయన కూడా ఆఫ్రికన్ హిందూ ధర్మ ప్రచారాన్ని చేసారు ఈయన కూడా కొద్దీ రోజుల క్రితం కాలం చేసారు .ఇప్పుడు వేరే స్వామిజి ఉన్నారు అయన అద్వర్యం లో మన ధర్మాన్ని ఆచరిస్తూ ప్రచారం చేస్తున్నారు .ఇప్పుడు ఘన నుండి పక్కనే ఉన్న టోగోకి సనాతన ధర్మం విస్తరిస్తోంది

దీపు దీప్తి

About The Author