చేతులెత్తి మొక్కుతా … మాస్కులు వేసుకోండి…
– – _- నా __పరిస్థితి పగవాడికి కూడా వద్దు_
– – – _కరోనా వైరస్ తో ఇప్పటికీ తీవ్ర ఇబ్బంది పడుతున్నా_
– – – _నా పరిస్థితి ఎవరికీ రాకూడదనే మస్కులపై ప్రజల్లో చైతన్యం_
__
— *తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి*
_తాడిపత్రి_
_ప్రతిరోజు రోడ్లపై తిరుగుతూ చేతులెత్తి మొక్కుతా సామి! … మీరు మాత్రం మాస్కు వేసుకోకుండా తిరగవద్దు_ __అంటూ తాడిపత్రి పట్టణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్_ _రెడ్డి … _విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు… జిల్లాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది… ఈ విషయమై తనను కలిసిన_ _విలేకరులతో జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపిన విషయాలు ఆయన మాటల్లోనే…_
_ఒక _అక్రమ_ కేసులో కడప జిల్లా జైల్లో ఉన్నప్పుడు కరోనా _వచ్చింది… విడుదలయిన_ తర్వాత దాదాపు నెల రోజుల పాటు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందాను_ … _కరోనా నుండి కోలుకొని ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఆ కరోనా వల్ల తీవ్ర ఇబ్బంది పడుతూనే ఉన్నా_ …. నా _కాళ్లు సహకరించడం లేదు… నా వెంట వచ్చే వారి భుజం మీద చెయ్యి వేయందే నడవలేకపోతున్నా…. ఇప్పటికీ__ _విపరీతమైన నొప్పులు ….. పగవాడు కూడా ఈ నరకం అనుభవించాలని కోరుకోను…. అదీ నా తాడిపత్రి_ _ప్రజలకు ఈ వైరస్ వస్తే నేను ఎంత బాధ పడతాను అనే విషయం మీరు ఆలోచించండి…. మెయిన్ బజార్ లో_ __నాకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ఆర్యవైశ్య కుటుంబంలో ఏకంగా నలుగురు కరోనాతో చనిపోయారు__ _ఆ కుటుంబ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి… అందుకే మా తాడపత్రి ప్రజల్లో కరోనా పై చైతన్యం_ _కల్పించడానికి కంకణం కట్టుకున్నా…._ నా వయసు 68 సంవత్సరాలు… యువతరానిదే భవిష్యత్తు…_ _మాస్కులు వేసుకుని…. సామాజిక దూరం పాటిస్తేనే కరోనాని కట్టడి చేయగలము అనే విషయాన్ని ప్రజలకు వివరించడానికే ప్రధాన రహదారులలో_ _మాస్క్ ఆవశ్యకతను వివరిస్తూ తిరుగుతున్నాను….. 40 సంవత్సరాలుగా మా తాడిపత్రి ప్రజలు_ మా కుటుంబాన్ని ఆదరిస్తూనే _వున్నారు… వారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత నా పైన లేదా ? అందుకే ప్రతిరోజు రోడ్లపై వెళ్తూ_ _చేతులెత్తి దండం పెట్టి మాస్క్ వేసుకొని తిరగండి స్వామీ అంటూ ప్రాధేయ పడుతున్నా…. కొన్ని సందర్భాల్లో_ _కటువుగా మాట్లాడి ఉంటా…. మా _ప్రజలు అర్థం చేసుకుంటారు…_
_చివరగా ఒక్క మాట … మాస్కులు వేసుకోండి_ ౼౼ సామాజిక దూరం పాటించండి అనే నినాదంతో కరోనా కట్టడి చేయాలని తాను చేస్తున్న ప్రయత్నానికి_ _ప్రజల నుండి సంపూర్ణ సహకారాలు లభిస్తాయి అని ఆశిస్తున్ననని తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు…_