లగేజీ మాత్రం తీసుకోవద్దు.. ప్రయాణికులకు యూఏఈ హెచ్చరికలు


అబుధాబి: విదేశాల నుంచి యూఏఈ వచ్చే ప్రయాణికులను ఉద్దేశించి ఆ దేశ ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ(ఎఫ్‌సీఏ) కీలక ప్రకటన చేసింది. సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం కోసం ప్రయాణికులకు పలు సూచనలు ఇచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వారిచ్చే లగేజీ, బ్యాగులలో ఏముందో తెలుసుకోకుండా వాటితో ప్రయాణించొద్దని తెలిపింది. మోహమాటం వల్లకానీ లేదా మరే ఇతర కారణాల వల్లగాని అపరిచుతులు ఇచ్చే లగేజీలను స్వీకరించొద్దని పేర్కొంది.

అపరిచిత వ్యక్తులు ఇచ్చే లగేజీ/బ్యాగులలో నిషేధిత వస్తువులు ఉండీ..వాటితో ప్రయాణికులు ప్రయాణించినట్టైతే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. జైలు శిక్షతోపాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని వేల్లడించింది. చాలా దేశాలలగే నార్కోటిక్స్, ఫేక్ కరెన్సీ, అసభ్యకరమైన ఫొటోలు తదితరాలపై యూఏఈ కూడా నిషేధం విధించిందని పేర్కొంది. యూఏఈ నిషేధిత జాబితాలో పెట్టిన వస్తువులు, పదార్థాలతో ప్రయాణికులు ప్రయాణిస్తే.. వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసింది.

ఎవరైనా ప్రయాణికులు మెడిసిన్స్‌తో ప్రయాణం చేయాలనుకుంటే.. ఎయిర్‌లైన్స్ గైడ్‌లైన్స్, నిబంధనల ప్రకారం సర్టిఫైడ్ ప్రిస్క్రిప్షన్‌ చూపించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రయాణికులు యూఏఈకి చేరుకున్న తర్వాత వారి వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువులను ప్రకటించాల్సి ఉంటుందని తెలిపింది.

About The Author