ఎదురుదాడే… ఈట‌ల‌పై కేసీఆర్ గేమ్ లో రేవంత్ రెడ్డి రివ‌ర్స్ ఎటాక్


ముల్లును ముల్లుతోనే తీయాలి… కేసీఆర్ వ్యూహాన్నిఅదే వ్యూహాంతో దెబ్బ‌తీయాలి… దెబ్బతిన్న పులిగా కేసీఆర్ ను ఎలా సైలెంట్ చేయాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ఈట‌ల సాఫ్ట్ నెస్ పై దూకుడుగా వెళ్తున్న కేసీఆర్ కు క‌ళ్లెం వేయ‌టంలో రేవంత్ స‌క్సెస్ అయ్యాడ‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది.
ఈట‌ల శామీర్ పేట‌లోని దేవ‌ర‌యంజాల్ లో దేవాల‌య భూములు ఆక్ర‌మించ‌డాన్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దానిపై న‌లుగురు ఐఏఎస్ ల‌తో క‌మిటీ, విజిలెన్స్ క‌మిటీ, ఏసీబీ టీంతో ద‌ర్యాప్తు క‌మిటీలు వేస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈట‌ల ఒక్క మాట అంటే… విచార‌ణ‌, అరెస్టులన్న ప‌దాలు ప్ర‌భుత్వం నుండి గ‌ట్టిగా వినిపిస్తున్న సంద‌ర్భంలో… రేవంత్ ఎంట‌రైపోయాడు. ఈట‌ల ఎపిసోడ్ లో ఆయ‌న‌పై సానుభూతి చూపించిన వారు మాత్ర‌మే క‌న‌ప‌డ‌గా, ఇప్పుడు కేసీఆర్ పై ఎదురుదాడిని రేవంత్ మొద‌లుపెట్టాడు.
ఈట‌ల స‌రే… మ‌రి నీ బంధువుల సంగ‌తేంటీ?, నీ కొడుకు కేటీఆర్ కు కూడా అక్క‌డ భూమి ఉంది…? అది కూడా క‌బ్జానా…? కేటీఆర్ ను కూడా బ‌ర్త‌ర‌ఫ్ చేయ్… న‌మ‌స్తే తెలంగాణ ప్రింట్ అవుతున్న భూములు స‌క్ర‌మమేనా అంటూ రేవంత్ ఉల్టా అటాక్ స్టార్ట్ చేశాడు. గ‌తంలో గోప‌న‌ప‌ల్లిలో అక్ర‌మాలు అంటూ రేవంత్ రెడ్డి ఫాంహౌజ్ పై దాడి చేసి… ప్ర‌భుత్వం హాడావిడి చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఆ స‌మ‌యంలో రేవంత్ జ‌న్వాడ ఫాంహౌజ్ ను తెర‌పైకి తెచ్చి కేటీఆర్ సంగ‌తేంటీ అని ప్ర‌శ్నించ‌టంతో స‌ర్కార్ సైలెంట్ అయ్యింది. ఇప్పుడు ఈటల విష‌యంలోనూ రేవంత్ అదే వ్యూహాంతో వ‌చ్చాడు. సో… ఇప్పుడు కూడా కేసీఆర్ సైలెంట్ అవ్వ‌క‌పోతే మొత్తం చిట్టా విప్పేలా ఉన్నాడ‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది.
కేసీఆర్ లాంటి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని కొట్టాలంటే… నిజాయితీతో పాటు వ్యూహాలు, ఆధారాలు సేక‌రించే నైపుణ్యం కూడా ఉండాల‌ని… రేవంత్ మొద‌లుపెట్టిన ఎదురుదాడితో ఈట‌ల భూ వ్య‌వ‌హ‌రం కేసీఆర్ కుటుంబానికి చుట్టుకునేలా ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

About The Author