ఒక చిన్న కథ తప్పకుండా చదవండి ప్లీజ్…నిజంగా జరిగిన కథ.
ఈ పోస్టును చాలా జాగ్రత్తగా చదవండి, ఇది ఆసక్తికరమైనది…
కొన్ని రోజుల క్రితం నేను అలహాబాదునుండి ప్రయాణికుల రైలులో లక్నోకు వెళ్తున్నాను. తరువాత ప్రయాగ స్టేషన్ లోనే చాలా ప్రకాశవంతమైన ముఖం కల, ఆకర్షణీయమైన మహిళామణి నా ముందు సీటులోనికి వచ్చి కూర్చున్నది. అప్పుడు నేను, ఆమె సంభాషించుకోవటం జరిగింది. జాగ్రత్తగా చదవండి.
మహిళ: – ఈ రైలు రాయ్ బరేలీ స్టేషనుకు వెళ్తుందా?
నేను అవును, అని మెడ ఊపాను…
మహిళ: – ఎంత దూరం ???
నేను: – 12-15 స్టేషన్ ల తర్వాత, అది వచ్చినప్పుడు, నేను మీకు చెప్తాను.
మహిళ: – ధన్యవాదాలు, మీరు ఏమి చేస్తారు?
నేను: – అడ్వకేట్. మీరు ఏమి చేస్తారు?
మహిళ: – నేను భౌతిక ప్రపంచంపైకి ఎదిగి, ప్రభువు జీసస్ కు నా జీవితాన్ని అర్పించాను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. యేసు మహిమ అనంతమైనది.
నేను – మేడమ్, నేను కృష్ణుని కర్మయోగం ప్రకారం జీవిస్తున్నాను. అందుకే, భౌతిక ప్రపంచంలో కూడా సంతోషంగా ఉంటాను. కృష్ణుని మహిమ అలౌకికమైనది.
మహిళ: – అది సరే, లార్డ్ జీసస్ గురించి మీకు తెలుసా ???
నేను: – నేను అది అవసరం అని అనుకోను.
స్త్రీ: – ఎందుకు ??
నేను: – యేసు ముందు, చాలా గొప్ప మహాపురుషులు మా దేశంలో పుట్టారు. నా వేదాలు, ఉపనిషత్తులు నాకు సరిపోతాయి, ఐరోపాలో పుట్టిన ఒక వ్యక్తి ఇచ్చే శిక్షణం నాకు అవసరం లేదు.
స్త్రీ: – సరే, మంచిది. నేను చాలా వేదాలను లోతుగా అధ్యయనం చేశాను. కానీ వాటిలో కొన్ని లోపాలు ఉన్నాయి.
(ఇప్పుడు మొత్తం విషయం నేను అర్థం చేసుకున్నాను, మేడంగారు నన్ను క్రైస్తవుడిగా చేసే లక్ష్యంతో కూర్చున్నది.)
నేను: – మీరు చాలా సూక్ష్మంగా అధ్యయనం చేసారా?
స్త్రీ: – అవును, పూర్తిగా.
నేను: – ధర్మం యొక్క ఐదు లక్షణాలు ఏమిటి?
(ఆ మహిళ యొక్క వేదాల పూర్తి జ్ఞానం తునాతునలకైపోయింది. ముఖం మీద భావం, అక్కడికేదో కంపెనీ ఆర్థిక విశ్లేషణం చెప్పమన్నట్టుగా అయింది.)
నేను: – ఏం జరిగింది, మీరు చాలా సూక్ష్మంగా అధ్యయనం చేసారు, మీరు 5 లక్షణాలనైనా చెప్పలేరా?
మహిళ: – అది నాకు గుర్తు లేదు.
నేను: – సరే, పోనివ్వడి, మనిషి యొక్క మూడు గుణాలు ఏమిటి?
(ఇప్పుడు యేసు భక్తురాలికి చెమట పట్టింది. అసౌకర్యంగా కనిపించింది. ఇప్పుడు దానితోపాటు పక్కనున్న 5- 6 మంది జాగ్రత్తగా మాటల యుద్ధాన్ని వినసాగారు.)
ఆ స్త్రీ ఇలా చెప్పింది: – చూడండి, యేసు యొక్క మార్గం చాలా సులభం.
నేను: – నేను కృష్ణుడి మార్గంలో మాత్రమే సంతోషంగా ఉన్నాను.
మహిళ: – చూడండి, మేము గ్రీకు నాగరికతకు చెందిన క్రైస్తవులం, మేము మానవ నాగరికతను అభివృద్ధి చేసాము.
నేను: – అయితే ఏంటి? మేము కూడా సింధులోయకు చెందిన హిందువులం. మొట్టమొదట మానవ నాగరికతను మేమే అభివృద్ధి చేశాము, మీ ప్రజలు కాదు.
(ఇప్పుడు చుట్టూ ప్రజలు ఆ స్త్రీపై నవ్వడం వరకు వచ్చింది. అందరూ ఆమె వైపు ఉత్సుకతతో చూస్తున్నారు. మేడం తన మొబైలు తీసి ఎవరికో ఫోను చేసింది. కొద్దిగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది. అప్పుడే ఊంచాహార్ స్టేషను వచ్చింది. మహిళ దిగుతానని లేచింది.)
నేను – రాయ్ బరేలీ ఇంకా 4-5 స్టేషన్ లు తరువాత ఉన్నదని- చెప్తే, ఆమె ఏదో ఒక ముఖ్యమైన పని కోసం ఇక్కడే దిగుతున్నానని అంది. తరువాత ఆమె తన చేతిని చాపి, చాలా నిరుత్సాహంతో, ‘మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషించాను’ అన్నది. నేను కూడా చేతులు కలిపి, ‘నాకంటే ఎక్కువైతే అయి ఉండదు’ అని చెప్పాను. పాపం, ఆమె మౌనంగా ఊంచాహార్ లో దిగిపోయింది.
కాబట్టి విషయం ఏమంటే మీ మతం గురించి మీకు తెలియాలి, లేకపోతే ప్రజలు మీ ముఖం మీద మీ మతం తప్పులను లెక్కిస్తారు. మీరు ఏమీ ఎదురు చెప్పలేకపోతారు. కనీసం మతం యొక్క కొన్ని లక్షణాలను గుర్తుంచుకోండి. నా స్థానంలో సనాతనధర్మం ఎరిగినవారెవరైనా ఉంటే ఆ మహిళ బహుశా ఊంచాహార్ వచ్చే ముందు కదిలే రైలు నుండి దూకేసేదేమో….
ధర్మో రక్షతి రక్షితః
[వాట్సాప్ లో వచ్చిన ఓ హిందీ సందేశానికి తెలుగు అనువాదం]