మౌన నిరసన దీక్షను చేసిన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నేతలు
* కరోనా నివారణ ప్రణాళికా బద్దంగా యుద్ధప్రాతిపదికిన చర్యలు చేపట్టాలి
* వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబానికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలి
* పాజిటివ్ సోకిన వారికి మందులతో పాటు ఆక్సిజన్, కిట్లు అందించాలి.
* రెండవ దశతోనే ఈ వ్యాధిని నివారించే విధంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి.
* టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు, Ex.Mla బోండా ఉమ పాజిటివ్ సోకిన వారికి ప్రభుత్వాలు అండగా ఉండాలని
– మౌన నిరసన దీక్షను చేసిన సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ నేతలు
కరోనా రెండో దశ మరింత విజృంభించి వ్యాధి సోకి ప్రజల ప్రాణాలని హరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికా బద్దంగా యుద్ధప్రాతిపదికిన చర్యలు చేపట్టాలని, వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబానికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ సోకిన వారికి మందులతో పాటు ఆక్సిజన్, కిట్లు అందించాలని, రెండవ దశతోనే ఈ వ్యాధిని నివారించే విధంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, వ్యాధి గ్రస్తులకు ధైర్యం ఇచ్చేటువంటి విధంగా పాలకులు ముందుకు సాగాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు డిమాండ్ చేశారు.
ది. 08-05-2021 శనివారం ఉదయం సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి…. ప్రజల ప్రాణాలను కాపాడాకలంటూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు,Ex.Mla బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాలతో విజయవాడ సెంట్రల్ నియోయాజకవర్గ తెలుగుదేశంపార్టీ కమిటీ ఆధ్వర్యంలో మౌన నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ 2020లో కరోనా మొదటి దశ ప్రపంచవ్యాప్తంగా సోకి ప్రజల ప్రాణాలకి హరించిన రెండవ దశను గుర్తించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన స్థాయిలో పని చెయ్యలేదని అన్నారు. దీనితో మొదట దశలో పాజిటివ్ సోకిన వ్యాధి గ్రస్తులకంటే రెండవ దశలో పాజిటివ్ సోకినా వ్యాధి గ్రస్తులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే కాకుండా వెంటనే మరణాలు కూడా సంభవించడం జరుగుతుంది. దానికి తగిన విధంగా పాలకులు ప్రణాళికాబద్ధంగా నివారించడంలో వైఫల్యం చెందడంతో రోజురోజుకి మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. వెంటనే ప్రతి ఇంటికి వాలంటీర్ల ద్వారా పరీక్షలు నిర్వహించి వ్యాధి సోకినా వారికి త్వరితగతిన వైద్యం అందించడంతో పాటు వారికి మనో ధైర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ దావకాణాల ద్వారా పడకలు మరింత పెంచి మందులు, ఆక్షిజన్, కిట్లు అందించాలని, ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని నివారించి పర్యవేక్షణ ఉంచి విస్తృత స్థాయిలో వైద్యం అందించి ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన దీక్షలో టీడీపీ నేతలు పరుచూరి ప్రసాద్,పిరియా సోమేశ్వరరావు, కె.దుర్గారావు, పాలపర్తి కోటేశ్వరరావు, ముప్పా కిశోరె బాబు, గరిమెళ్ళ చిన్న, తుంపక శివ,తదితరులు పాల్గొన్నారు.