తిప్పతీగ! ఒక అద్భుత ఔషధం !!


మీ శరీరం లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే చావు లేని మొక్క .
పూర్వం దేవ దానవుల మధ్య అమృతం కోసం వాటాలు వేసుకున్నపుడు జగన్మోహినిని దానవులు తరుముతుంటే ఆమె పరుగు పెడుతుంటే అమృత భాండం లో నుండి చుక్కలు నేలపై రాలి మొక్కగా ( పాదు ) పెరిగింది .
అందుకే దీని పేరు ” అమృత ” తెలుగులో ” అమృతవల్లి ” ఇంకో పేరు ” తిప్ప తీగ ” మీరు ఇప్పుడు చూడ బోయే ఫోటోలలో టిప్ప టిగో అని కనిపించిందని కంగారు పడకండి . తిప్ప తీగ అని చదువుకోండి .
చికెన్ గున్యా , డెంగూ లకు ఇది మందు . ఇది సర్వ రోగ నివారిణి . దీని గురించి 2009 జూన్ ” యోగ సందేశం ” లో తెలుగులో వివరాలు వ్యాసం రూపం లో ఆచార్య బాల కృష్ణ గారు ఇచ్చారు .
ఆ వ్యాసం లో కొంత భాగం నేను ఇక్కడ ఫోటోల రూపం లో స్కాన్ చేసి పెడుతున్నా . చదవండి.
ప్రయోజనాలు:
తిప్పతీగ శరీరంలోని మూడు స్రావాలను( వాత , పిత్త, కఫాలను) నియంత్రిస్తుంది .
జిడ్డుగా ఉండటం వల్ల అది వాయువును, చేదు, పుల్లటితనం ( పుల్ల త్రేన్పులు) , దగ్గు, కళ్ళెలను నియంత్రిస్తుంది.
ఇది కుష్టు, నెప్పులు, దాహం, వాంతులు కూడా తగ్గిస్తుంది.
ఇది జీర్ణకారి, చక్కటి ఆకలి కలిగిస్తుంది. పిత్తరసాన్ని( పైత్యం ) నియంత్రించి క్రమబద్ధీకరిస్తుంది మరియు క్రిములను చంపుతుంది.
ఇది గుండెకు బలాన్ని చేకూర్చి పచ్చకామెర్లు, రక్తలోపాలను తగ్గిస్తుంది.
జలుబు, మధుమేహం, చర్మ వ్యాధులు, ఎన్నో రకాల జ్వరాల్లో అది అద్భుతంగా పని చేస్తుంది.
ఆధునిక వైద్యుల అభిప్రాయం ప్రకారం, సూక్ష్మ వైరస్ల విషయంలో అది ప్రభావాన్ని చూపిస్తుంది.
ఇది మైకో బేక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే మైక్రోబ్ పెరుగుదలను తనిఖీ చేస్తుంది.
తిప్పతీగ శరీరంలోని ఆ భాగాలను చేరుకొని అక్కడ చురుకుగా ఉన్న మైక్రోమను నాశనం చేస్తుంది.
పేగులు, మూత్ర వ్యవస్థతో సహా మొత్తం పూర్తి శరీరాన్నే నాశనం చేసే ఎస్కనీషియా కోలై క్రిమిని ఈ వనమూలిక నాశనం చేస్తుంది.
షుగర్ :
ఈ వనమూలిక ఇన్సులిన్ ఎక్కువగా స్రవించటాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.
కంటి జబ్బులు :
వైద్యపరమైన వాడకం కంటి వ్యాధులు తిప్పతీగ రసం రాతి ఉప్పు, తేనెలో కలిపి 1 గ్రా చొప్పున ఉపయోగిస్తే నైట్ బ్లెండ్ నెస్, దురద, పిల్ల, కంటిలోని తెలుపు, నలుపు గుడ్డుకు చెందిన వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయి. తిప్పతీగ మరియు త్రిఫల రసం తేనెలో కలిపి ప్రతిరోజూ ఉదయం వేళ ఉపయోగిస్తే కంటి చూపు త్వరలోనే నయమవుతుంది.
చెవిలో గులిమి:
తిప్పతీగ రసం 2 చుక్కలు నీటితో కలిపి రోజుకి రెండుసార్లు తీసుకుంటే గులిమి బయటకు వస్తుంది.
సంగ్రహిణి:
శొంఠి, మోథా, అటీస్, టిప్పటిగో డికాక్షన్ సమానంగా తీసుకొని నీరు కలపండి. ఉదయం, సాయంత్రాలు దీన్ని 20-30 గ్రా తీసుకుంటే – అజీర్ణం, ఉదరంలో క్రిములు, జిగురుతో కూడిని తీవ్రమైన అతిసారం – తగ్గుముఖం పడతాయి.
వికారం:
అదూసబర్క్, తిప్పతీగ, చిన్న కటేరిలను సమానంగా తీసుకొని ఉడికించండి. నీరు 1/4 వ వంతు వచ్చేంత వరకు మరిగించాలి.
చల్లారిన తర్వాత ఈ డికాక్షన్ ను తేనెతో తీసుకుంటే వాపు, తీవ్రమైన జలుబు, ఆయాసం, జ్వరం, వికారాలు తగ్గిపోతాయి.
తిప్పతీగ 10-20 గ్రా డికాక్షన్ లేదా రెండు చెంచాల తేనెలను తీసుకుంటే అన్ని రకాల వికారాలు తగ్గుతాయి.
వెక్కిళ్లు :
తిప్పతీగ, శొంఠి పొడులను నశ్యం రూపంలో తీసుకుంటే వెక్కిళ్ల సమస్య తగ్గుతుంది లేదా పాలతో కొంఠి మరియు తిప్పతీగ మిశ్రమాన్ని తీసుకోవాలి.
క్షాంతోప్సి
20-30 గ్రా తిప్పతీగ డికాక్షన్లో రెండు చెంచాల తేనె కలిపి రోజులో 3-4 సార్లు తాగితే క్షాంతోప్పి వ్యాధి తగ్గుతుంది.
తిప్పతీగ 10-20 ఆకుల రసంలో మీగడ, వెన్న తీసేయగా మిగిలిన పదార్ధం వడకట్టి తాగితే ఈ వ్యాధి తగ్గుతుంది.
తిప్పతీగ చిన్న ముక్కలుగా దండగా ధరించినా ఈ వ్యాధి తగ్గుతుంది.
ఆర్శ మొలలు:
హరద్ ( కరక్కాయ) , తిప్పతీగ , ధనియాలను 20 గ్రా చొప్పున తీసుకొని 1/2 లీటర్ల నీటిలో మరిగించండి. అది 1/4వ వంతు డికాక్షన్ అయ్యేంత వరకు మరిగించండి. ఉదయం, సాయంత్రాలు దాన్ని బెల్లంతో తీసుకుంటే అన్ని రకాల ఆర్శ మొలలు తగ్గుతాయి.
పచ్చకామెర్లు:
పునర్నవ 20 గ్రా, మరోసా చెట్టు కాండం, పటోల్పట్రీ, శొంఠి, కటుకి, తిప్పతీగ, దారు హల్డి (పసుపు లో ఒక రకం) , హరడ్లను (కరక్కాయ) 320 గ్రా నీటిలో వేసి 80 గ్రా డికాక్షన్‌గా తయారు చేయండి.
ఉదయం, సాయంత్రాలు ఈ డికాక్షను 20 ఎమ్ఎల్ చొప్పున తీసుకుంటే పచ్చకామెర్లు, ఉబ్బసం, ఉదర వ్యాధులు, పూర్తి శరీరంలో వాపు తదితరాలు తగ్గుతాయి.
1 కిలో తిప్పతీగ రసం, కలాకండ్ ( పటిక బెల్లం ) 250 గ్రా, పాలు 4 లీటర్లు, 1 లీటరు గేదె పాలతో చేసిన నెయ్యిలను తక్కువ మంట పై పెట్టి పెట్టి కేవలం నెయ్యి మాత్రమే మిగిలిపోయినప్పుడు దాన్ని వడకట్టండి.
దీన్ని 10 గ్రా ఉపయోగించాలి. ఈ నెయ్యిని, 4 రెట్లు ఆవు పాలు తీసుకొని ఉదయం, సాయంత్రం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతుంది
మూత్రవ్యాధి :
తిప్పతీగ, ఖస్ ( వట్టివేరు) , పధాని, లోధ్రా, అంజన్, ఎర్ర చందనం, నాగర్‌ మోతా, అనోల, హరద్, పర్వల్ ఆకులు, వేప చెట్టు కాండం, పద్మకస్తత చెట్టు సమానంగా తీసుకొని రుబ్బి వడకట్టండి. ఈ పొడిని 10 గ్రా తీసుకొని దానికి తేనె కలిపి రోజుకి 3 సార్లు తీసుకుంటే బిలియస్ వ్యాధి వల్ల కలిగిన మూత్ర వ్యాధి తగ్గుతుంది. .
మూత్రవ్యాధి లేదా జ్వరం తరచు వస్తుంటే తిప్పతీగ రసం, స్తట్ పల్, నెయ్యి, అభయ్ లేదా త్రిఫలను తీసుకోవాలి. తిప్పతీగ మరియు చిత్రక్ డికాక్షన్లను ఉదయం, సాయంత్రాలు 20-30 గ్రా తీసుకుంటే సర్పి ప్రమేహం తగ్గుతుంది. 2 చెంచాల తేనె, 10-20 గ్రా తిప్పతీగ రసం రోజుకి 2-3 సార్లు తీసుకుంటే ప్రమేహ వ్యాధి తగ్గిపోతుంది.
కాలేయ వ్యాధి మరియు అజీర్తి
తిప్పతీగ 18 గ్రా, అజ్మోద 2 గ్రా, చిన్న పిప్పళి 2 ముక్కలు, 2 వేప రెమ్మలు రుబ్బి ఒక రాత్రంతా ఒక మట్టిపాత్రలో 250 గ్రా నీరు పోసి నానబెట్టాలి. తర్వాత రుబ్బి వడకట్టి దాన్ని ఉదయం నీటితో కలిపి తాగాలి. ఇది 15-30 రోజుల్లోనే ఉదర వ్యాధులన్నింటినీ నయం చేస్తుంది.
బోదకాలు: కటుటలై 50 ఎమ్ఎల్. తిప్పతీగ 10-20 గ్రా ప్రతీరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే బోదకాలు తగ్గుతుంది.
గౌట్: రోజుకి 2-3 సార్లు పాలతో తిప్పతీగ పొడి 2-5 గ్రా తీసుకుంటే మూత్రంలో ఎసిడిటీ, గౌట్ తగ్గుతాయి.
వివిధ ఇతర రకాలు
10-20 గ్రా తిప్పతీగ రసం, బెల్లం కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.
మిశ్రితో ( పటిక బెల్లం) కలిపి దాన్ని తీసుకుంటే పిత్తకు ( పైత్యం ) సంబంధించిన అన్ని వ్యాధులు తగ్గుతాయి.
దాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. శొంఠి, తిప్పతీగ రసం కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరంతో కూడిన విరేచనాలు తగ్గుతాయి.
తిప్పతీగ, నల్ల మిరియాలు, గోరు వెచ్చటి నీటితో తీసుకుంటే గుండెపోటు సమస్య తగ్గుతుంది.
వ్యాధి తీవ్రతను బట్టి . తిప్పతీగ ను క్రమబద్ధంగా 7 రోజులు తీసుకోవాలి.
గౌరవనీయ స్వామి రామ్ దేవ్ జీ చెప్పే అనుభవ వైద్యం :
కాన్సర్ :
వివిధ రక్త క్యాన్సర్ రోగులకు తిప్పతీగ స్వరాలను, జవహర్ (గోధుమ గడ్డి రసం) తో కలిపి ఇస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుంది.
బాబా గారు చెప్పే ఈ విధానం ద్వారా క్యాన్సర్ రోగులకు నయమమతోంది.
పద్ధతి 2 అడుగుల పొడవు, 1 వేలు వెడల్పు గల తిప్పతీగ 10 గ్రా గోధుమ ఆకులను నీటితో రుబ్బాలి. వడకట్టిన ఈ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో ఉపయోగించాలి.
ఆశ్రమం ఇచ్చిన మందులతో పైన చెప్పిన తయారీని ఇచ్చినట్లైతే ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధులు తగ్గుతాయి. .
ఇంకా తులసి , పసుపు , గోమూత్రం కూడా కలిపి చెప్తూ ఉంటారు

About The Author