జీతాలు పెంచాలంటూ జూనియర్ డాక్టర్ల ఆందోళన
గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 15 శాతం జీతాలు పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. 10 శాతం ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని జూడాల డిమాండ్ చేశారు. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే.. నిమ్స్‌లో వైద్యం అందించేలా జీఓ అమలు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. అంతేకాక కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు.