జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి.


కరోనా వైరస్ కారణంగా చనిపోయిన జర్నలిస్టులు కుటుంబాలకు 50 లక్షల పరిహారం చెల్లించాలని యూనియన్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్స్ (UTJ) డిమాండ్ చేశారు.
జర్నలిస్టు పట్ల కేసీఆర్ మొండి వైఖరికి నిరసనగా కూకట్పలి వై జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీ ల తో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ” అక్రిడేషన్ తో సంబంధం లేకుండా కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ప్రైవేటుఆసుపత్రుల లో ఉచితంగా చికిత్స అందించాలని,ప్రతి జర్నలిస్టు కు పదివేల రూపాయల సహాయాన్ని తక్షణమే అందజేయాలి ” అని అన్నారు. ఒరిస్సా, త‌మిళనాడు రాష్ట్రల తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మోహన్ బైరాగి, నరసింహ, ఆనందరావు,భాషా, భూపాల్ రెడ్డి , సాయి తదితరులు పాల్గొన్నారు.

About The Author