గుర్తు పెట్టు కోవలిసిన జ్ఞాపకాలు పుల్లయ్య బావి ఒంగోలు…
పుల్లయ్య బావి ఒంగోలు ?
పుల్లయ్య బావి అంటే ఒంగోలునగరంలో పాతిక ఏళ్ల ముందు తరం పౌరులందరికి సుపరిచయమే
పూర్వం నుండి ఒంగోలు కు
నీటి కరువు ఊరుగా పేరు ఉండేది
సమ్మర్ స్టోరేజ్ ట్యాoక్ లు రాకపూర్వం నగర ప్రజల దాహార్తి తీర్చేది ఒకటి రంగా రాయుడి చెరువు అయితే రెండోది పక్కనే ఉన్న పశుపతేశ్వరుని ఆలయం లోని పుల్లయ్య బావి ….మూడవది చెరువు కట్టపైఉన్న గాంధీ పార్కులోని మర బావి ఈ మూడూ నీటి కల్పతరువులే
పుల్లయ్య గారిని ముఖ్యంగా రంగరాయుడు గారిని మన దాహార్తిని తీర్చిన నీటి వనరుల దాతలుగా నగర ప్రజలు గుర్తు ఉంచు కోవలసిందే
నీళ్లు సులభంగా తొడుకోవాటానికి బాగా అందుబాటుగా ఉండేది పుల్లయ్య బావే
ఇక్కడ వేకువ జాము నుంచి అర్ధరాత్రి వరకు కూడా బావిలో నీళ్ళని చేదు తూనే ఉండేవారు బావి చుట్టూ ఉండే గిలకలపైచాంతాడులుపాములులాగా
వేలాడుతూ ఉండేవి ఆ ప్రాంతం గిలకలు
చేసే కిలకిల శభ్ధాలతో సవ్వడిగా సందడిగా ఉండేది
దగ్గర ప్రాంతం వారు ఇండ్లలోకి వాడు కోవటానికి బిందె లతోవచ్చేవారు
కొందరైతే పట్టణంలోని హోటళ్లకు, సినిమా హాళ్లకు,కొన్ని కొట్లకు పీపాలతో
నీళ్లు పోసేవారు కొందరు
ఇప్పుడు రిక్షా పీపాలు, మోటార్ రిక్షా పీపాలతో నీళ్లు సప్లై చేస్తున్నట్లు గానే పూర్వం ఎద్దుల బండి పై చెక్క పీపాలు తో నీళ్ళని సప్లై చేసేవారు అప్పట్లో
పశుపతేశ్వరాలయం దగ్గర ట్రాఫిక్ అంతా
ఈ నీళ్ల పీపాల వారిదే
ఒంగోలులో చాలా బావులు ఉప్పునీళ్లవె
అవికూడా ఎంతో లోతులో ఉండేవి వేసవి కాలంలో నీళ్లుమరీ అడుగంటి పోయేవి కాని పుల్లయ్య బావి నీళ్లు మాత్రం తాగటానికి ఇబ్బంది లేనివి గా ఉండేవి ఈ బావి మాత్రం అంతా15 అడుగులు లోతులో ఎప్పుడూ పుష్కలమైన జలతో
కళ కళ లాడుతూ ఉండేది
దగ్గరలోని స్మశానానికి పోయి వచ్చేవారందరు ఈ పుల్లయ్య బావి దగ్గర
కాళ్ళు కడుక్కోనో స్నానం చేసో పసుపతేశ్వరుని దర్శించుకొని ఇళ్లకు
వెళ్లే వారు ఇటీవల ఆలయ జీర్ణోర్ధరణ అనంతరం బావి చుట్టు ప్రహరీ గోడలు నిర్మాణ మౌటంతో క్రమీణ
ఈ పద్దది మారి పోయినది
పైగా ప్రత్యామ్నాయ వసతులు అక్కడక్కడ ఏర్పడటంతో జనం ఈపరమైన కార్యక్రమ స్నానాలకు బావి దగ్గరికి రావటం తగ్గించారు
మంచి నీటి కుళాయిలు బోరింగ్ లు
నగరానికి విస్త్రుతం గా అందుబాటులో రాని కాలంలో ముఖ్యంగా హోటళ్ళు వారు తాగునీటి కోసం ఎద్దుల బండి పీపాల మీదనే ఆధార పడే వాళ్ళు షుమారు పది పదిహేను పీపాల బండ్లు వారు ఈ నీటి రవాణా వృత్తిలో జీవించేవారు ఏళ్ల తరబడి కొన్ని కుటుంభాల వారికి జీవనోపాధి గా పరిసరప్రాంతాలవారికి దాహార్తిని తీర్చిన పాతాళగంగ గా పుల్లయ్య బావికి ఒక ఖ్యాతి చరిత్ర ఉంది
నిజానికి పుల్లయ్య ఎవరో
ఎప్పటి వాడొ కూడాచాలా మందికి
తెలియదు కాని పుల్లయ్య బావి మాత్రం నీటికి కటకట లాడిన ఒకానొక రోజులలో
ఒంగోలు ప్రజలను ఆదుకున్న జలాక్షయ
పాత్రని ఆ పాత గడ్డురోజులు గుర్తున్నవారికి తెలియనిది కాదు
ఒంగోలు నగర జనానికి నికి ఎన్నో సేవలందించి అలసి సొలసి విశ్రాంతితో ఇప్పుడు మౌనంగాఉంది…….
లేదులేదు ఇప్పటికి విశ్రాంతి లో లేదు
ఆ పశుపతేశ్వర స్వామి కిి నిత్యాభిషేకం కు పవిత్ర జలమై వినియోగ మౌతుంది
దినచర ఆలయ కైoకర్యాలకు సద్వినియేగం మౌతుంది
నాడు జన సేవలో నేడు శివ సేవలో తరిస్తున్న పుల్లయ్యబావికి నగర పౌరునిగా వందనం………….