జర్నలిస్టు రఘును వెంటనే విడుదల చేయాలి – మీడియాపై కక్ష సాధింపు చర్యలు తగదు.


టీయూడబ్ల్యుజే, రాజన్న సిరిసిల్ల, జిల్లా అధ్యక్షులు రాచర్ల లక్ష్మీ నారాయణ

ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న తొలి వెలుగు చానల్ రిపోర్టర్, యాంకర్ రఘును గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఉదయం మల్కాజిగిరిలో కిడ్నప్ చేశారు. రఘు కిడ్నాప్ ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాచర్ల లక్ష్మీ నారాయణ, ప్రధాన కార్యదర్శి తీగల మల్లికార్జున్ తీవ్రంగా ఖండించారు. నిత్యావసర సరుకుల కోసం షాపుకు వెళ్ళిన రఘును దుండగులు నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చి ముసుగు వేసి బలవంతంగా లాక్కెళ్లారు.
ఆచుకీ కోసం ఆయన కుటుంబ సభ్యులు ఆరా తీస్తున్నారు. మధ్యాహ్నం వరకు కూడా రఘు ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రఘును పోలీసులే ఎత్తుకెల్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ పోలీసులు రఘు అరెస్టును ధ్రువీకరించలేదు. ఇటీవల నల్గొండ జిల్లాలోనిగుర్రం పోడు గిరిజన భూముల అధికార పార్టీ ఆక్రమణపై రఘు రాజ్ న్యూస్ రిపోర్టర్ గా కథనాలు అందించారు.
రఘుపై IPC 143, 144, 147, 148, 149, 332, 333 r/w, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే
తప్పుడు కేసులపై రఘు కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు.
మీడియా గొంతు నొక్కెందుకే రఘును పోలీసులే అరెస్టు చేసి వుంటారని , రఘును తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

– రాచర్ల లక్ష్మీ నారాయణ
అధ్యక్షులు

తీగల మల్లికార్జున్
ప్రధాన కార్యదర్శి

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్
(టియూడబ్ల్యూజే)
రాజన్న సిరిసిల్ల జిల్లా

About The Author