పన్నెండు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు…


బాకీ తీర్చనీ కారణంగానే కిడ్నాప్ కు పాల్పడినట్లు విచారణలో వెల్లడి
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డి ఎస్ పి రమేష్ రెడ్డి

కృష్ణాజిల్లా మచిలీపట్నం :

గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లవోలు గ్రామ కాపురస్తురాలు అయిన ఓడుబోయిన నాగమణి w/o లేటు దుర్గారావు, 40 సo. ముదిరాజులు, మంగళవారం గూడూరు పోలీసు స్టేషన్ కు వచ్చి,అదే రోజు తెల్లవారు జామున అనగా ఉదయం 05.30 గంటల సమయంలో తన పిల్లలు ఇంటిలో ఉండగా మచిలీపట్నం మూడు స్తంబాల సెంటర్ వద్ద నివాసం ఉంటున్న సదరు ముద్దాయిలు అయిన టంకాల మనోహర్ నాయుడు, అతని తండ్రి సింహాచలం నాయుడు, అతని బావమరది హరీష్ మరి కొంత మంది కలిసి రెండు కారులు, రెండు ద్విచక్ర వాహనాలు పై వచ్చి పిర్యాది యొక్క చిన్న కొడుకు అయిన ఓడుబోయిన రాంప్రసాద్ ను, కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లిపోయారని, వారి నుండి నా కొడుకుకి ప్రాణహాని ఉందని పోలీసు వారికి 1:00 కి ఫిర్యాదు చేసింది.

తన కుమారుడు సదరు ముద్దాయలు దగ్గర సుమారు నాలుగు సం’..ల క్రితం పలు దఫాలుగా వారి వద్ద నుండి సుమారు 37 లక్షలు రూపాయలు అప్పు తీసుకుని, వారి బాకీ తీర్చ లేక గత ఎనిమిది నెలల క్రితం IP పెట్టినందున, సదరు ముద్దయిలు కోపోద్రేకానికి గురై వారి డబ్బులు తిరిగి రాబట్టుకునే ప్రయత్నములో పిర్యాది ఇల్లు అయిన, మల్లవోలు గరువు గ్రామం వెళ్ళి సదరు ఓడుబోయిన రాంప్రసాద్ ని ముద్దాయలు వారికి రావలిసిన డబ్బులు నిమ్మిత్తమ్ ఇష్టం వచ్చినట్లుగా కొట్టి, అడ్డు వచ్చిన ఆమెను బందువులని కొట్టి సదరు రాంప్రసాద్ ని వారి కారులో ఎక్కించుకుని, కిడ్నాప్ చేసి అతనిని బలవంతముగా తీసుకుని వెళ్ళినట్లు, ఆ తరువాత ముద్దాయలు పిర్యాదికి రెండు సార్లు ఫోన్ చేసి, మాకూ రావలిసిన డబ్బులు కడితే మీ అబ్బాయిని వదిలి పెడతాం అని, లేని ఎడల రాంప్రసాద్ ని బీచ్ కి తీసుకుని వెళ్ళి చంపేస్తాం అని బెదిరించినట్లు ఫిర్యాదు చేసింది.

ఆ ఫిర్యాదును గూడూరు పోలీసు స్టేషన్ ఎస్‌.ఐ ఫిర్యాది రిపోర్ట్ ను Cr.No.187/2021 U/s 451, 452,365,385,364(A),509,354 r/w 34 IPC కేసుగా నమోదు చేసి ఎస్.పి కి తగు సమాచారం అందించి ఎస్ పి ఆదేశాల మేరకు హుట హుటిన 3 స్పెషల్ బృందాలను నియమించి, విచారణలో రాబడిన రహస్య సమాచారం మేరకు,రాత్రి బాదితుని గుర్తించి,సదరు ముద్దాయిలు,సిఐ కొండయ్య,గూడూరు ఎస్సై దుర్గా ప్రసాద్,ఇతర పోలీసు సిబ్బంది చాక చక్యముగా ముద్దాయలను అదుపు లోనికి మరియు వారి వద్ద నుండి బాదితుని సంరక్షించి, బాదితునికి దెబ్బలు ఉన్నందున చికిత్స నిమిత్తం ప్రబుత్వ హాస్పిటల్ కి పంపడమైనది.

అదుపులోనికి తీసుకున్న ముద్దాయిలను అరెస్టు చేసి, కిడ్నాప్కు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్ట్ నందు హాజరు పరుస్తామని డిఎస్పీ తెలియజేశారు.

About The Author