జియో మరో కీలక నిర్ణయం..!
దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ధరల్లో విప్లవత్మాక మార్పులు తెచ్చిన జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ సేవలను జూన్ 17 నుంచి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ వర్గాలు ధృవీకరించాయి . ఇప్పటికే జియో ఫైబర్ ప్రీ పెయిడ్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.ఏలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఇంటర్నెట్ బాక్స్‌ను ఇవ్వనుంది.అంతేకాకుండా జీరో ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు వర్తించనున్నాయి. జియో ఫైబర్ ప్రీ పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగించుకోవడానికి కచ్చితంగా రూ. 1,500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. జియో పోస్ట్ పెయిడ్‌లో రూ.399 నుంచి టారిఫ్ ఫ్లాన్‌లు ప్రారంభం కానున్నాయి. ఆటో పేమెంట్ ఆప్షన్‌తో వినియోగదారులకు మరింత సులువు కానుందని కంపెనీ పేర్కొంది.
వినియోగదారులు రూ.1000 రిటర్నబుల్ సెక్యూరిటి డిపాజిట్‌తో 4K సెట్-టాప్ బాక్స్‌ను పొందవచ్చును. నెలకు రూ .999 ప్లాన్‌తో పదిహేను ఓటీటీ యాప్స్‌ను అందిస్తుంది.