కేంద్రప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ నేతలపై ఫైర్..మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ నేతల వైఖరిని విమర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
త్యాగాల తెలంగాణకు బీజేపీ చేసిందేంటి ?
– తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న సంతోషం, సంబరాలలో తెలంగాణ ప్రజలు ఉండగానే ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేశారు
– సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రకు కేటాయించారు
– ఒక్క రోజు నిర్ణయం తీసుకుని వారంలో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టును ఐదేండ్లు సాగదీశారు
– దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కట్టి ప్రజల బతుకుదెరువును పెంచిన రాష్ట్రం తెలంగాణ
– దేశంలో పంజాబ్ గత 70 ఏళ్లుగా అత్యంత ఎక్కువ వరి దిగుబడి చేసే రాష్ట్రంగా ఉంది
– ఏడేళ్ల తెలంగాణ రాష్ట్రం హరిత విప్లవానికి కేంద్రమైన పంజాబ్ ను తలదన్ని వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో నంబర్ వన్ గా నిలిచింది
– పంజాబ్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్ సీ ఐ ద్వారా వంద శాతం ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష ఎందుకు ప్రదర్శిస్తుంది
– ఇంత గొప్పగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఒక్కనాడయినా చేయూతనిచ్చారా ?
– యూపీఏ ప్రభుత్వంలో మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేశారు
– అభివృద్ధి చెందుతూ, దేశానికి చేయూతగా నిలుస్తున్న ఐదారు రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న నిధులను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రంలో చలనం లేదు
– తెలంగాణకు విభజనచట్టం ప్రకారం కేంద్రం ఏర్పాటు చేయాల్సిన గిరిజన విశ్వవిద్యాలయం, వరంగల్ లో రైల్వే కోచ్ ఏర్పాటు ఏమయ్యాయి ?
– కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు
– తెలంగాణలో రైల్వే కనెక్టివిటీ పెంచాలని విభజనచట్టం చెబుతున్నా కేంద్రం దానిని పట్టించుకున్న పరిస్థితి లేదు
– ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్రం ఏర్పడిన ఆరునెలలలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) పరిశీలిస్తుందని విభజనచట్టంలో కేంద్రం పేర్కొంది .. ఏడేళ్లయినా అడుగు ముందుకు పడలేదు
– కేంద్రం నుండి నగరీకరణకు, పట్టణీకరణకు అవసరమైన ప్రోత్సాహం లేదు
– తెలంగాణ సాధారణంగా ఏర్పడిన రాష్ట్రం కాదు,
సుధీర్ఘపోరాటం, అనేక బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం
– ఇంత గంభీరమైన పరిస్థితులలో ఏర్పడినప్పుడు రెండు రాష్ట్రాలను స్థిరపరచడం, వాటి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడం విజ్ఞతగల కేంద్రం భాద్యత
– కానీ కేంద్రం ఈ విషయంలో విజ్ఞత మరవడంతో పాటు భాద్యతను విస్మరించింది
– తెలంగాణ ఉద్యమం నడిచిందే నదీజలాల కోసం , సాగునీటి హక్కుల కోసం
– బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 17 ఏళ్లుగా పనిచేస్తున్నా ఇంతవరకు పరిష్కారం లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా తెలంగాణ నీటివాటా తేల్చరు
– సాక్షాత్తు ప్రధానమంత్రి లోక్ సభలో బిడ్డను కని తల్లి మరణించిందని తెలంగాణను అవమానించారు
– షెడ్యూలు 9,10 లో ఉండాల్సిన అంశాలను తేల్చడానికి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలను పెద్దరికం చేసి కేంద్రం సామరస్యంతో దారి చూపాల్సింది పోయి మీరేమన్న తన్నుకచావండి అన్నట్లు చాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్లు పెట్టింది
– సమస్యలు పరిష్కరించడంలో కేంద్రానిది పూర్తిగా నిష్క్రియాపరత్వం
– తెలంగాణకు బీజేపీ ఎక్కడ ? ఏ విషయంలో న్యాయం చేసింది ?
– నోటికొచ్చిన వాగుడు కాదు దమ్ముంటే ఈ సమస్యల గురించి మాట్లాడండి
– చేతనైతే తెలంగాణ – ఆంధ్ర నీటి, ఇతర సమస్యలను 10, 20, 30 రోజుల గడువు పెట్టి పరిష్కరించండి
– కృష్ణా నది నుండి అక్రమంగా నీళ్లు తీసుకెళుతున్న ఆంధ్రా జలదోపిడి మీద బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ఒక్కనాడైనా ఎందుకు మాట్లాడరు
– 3 టీఎంసీలను అక్రమంగా ఎత్తుకుపోయేందుకు నిర్మిస్తున్న సంగమేశ్వరం అక్రమ నిర్మాణంపై మాట్లాడని బీజేపీ నేతలకు తెలంగాణ పట్ల ప్రేమ ఎక్కడిది ? తెలంగాణ పట్ల స్ఫృహ ఎక్కడిది ? తెలంగాణ రోషం ఎక్కడిది ?
– ఓట్లు, సీట్లు అనే ధ్యాసతప్పితే తెలంగాణ పట్ల బీజేపీకి మమకారం లేదు .. బీజేపీ థర్డ్ క్లాస్, దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి
– తెలంగాణ పట్ల ప్రేమ మమకారం ఉన్నది టీఆర్ఎస్ కు మాత్రమే .. అందుకే 14 ఏండ్లు కొట్లాడి రాష్ట్రం సాధించినం .. ఇప్పటికీ రాష్ట్రం కోసం కొట్లాడుతనే ఉన్నం