కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం


జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తొయిబా టెర్రరిస్టులు హతమయ్యారు. సోపోర్‌ సమీపంలోని గుండ్‌బ్రాత్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భదత్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారంతా లష్కరే తొయిబాకు చెందిన టెర్రరిస్టులని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. వారిలో ఒకరు లష్కరే ఉగ్రవాదుల్లో ముఖ్యుడైన ముదసిర్‌ పండిత్‌ ఉన్నారని చెప్పారు. అతడు ముగురు పోలీసులు, ఇద్దరు కౌన్సిలర్లు, ఇద్దరు పౌరుల హత్యకేసుల్లో పాలుపంచుకున్నాడని వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అతనితోపాటు మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపారు.

About The Author