ఘరానా దొంగల ముఠా సభ్యులు అరెస్టు

చిత్తూరు జిల్లా:మదనపల్లి 2 వ పట్టణ పోలీసులు దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుండి రూ. 20.99లక్షల  విలువైన బంగారు, వెండి వస్తువులను రికవరీ చేయడం జరిగిందని మదనపల్లె డియస్పీ రవిమనోహరాచారి వెల్లడించారు.

బుధవారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డియస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ మదనపల్లె కు చెందిన నరసింహులు (29) సాయి కుమార్ (26) ఇద్దరు ముద్దాయిలు డబ్బులు ఎర చూపి మైనర్ బాలురులతో కలిపి ముఠాగా ఏర్పడి మదనపల్లె పట్టణంలో ఒకటిన్నర సంవత్సరములు గా  12 చోట్ల దొంగతనానికి పాల్పడి నట్లు తెలిపారు. ఈ ముఠాను పట్టుకోడానికి మదనపల్లె రెండవ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నర్సింహులు ఆధ్వర్యంలో తీవ్రంగా శ్రమించినట్లు తెలిపారు. దొంగల ముఠాను పట్టుకోవడానికి విశేషంగా కృషి చేసిన సిబ్బందికి మదనపల్లి డియస్పీ రవిమనోహరాచారి రివార్డ్స్ ను అందజేశారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరసింహులు ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బంది పాల్గొన్నారు.

About The Author