ఏపీలో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు, టిక్కెట్టు రేట్లపై రచ్చ
ఏపీలో తెరుచుకోనున్న సినిమా థియేటర్లు..ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయి అని ఎదురు చూస్తున్నా ప్రేక్షకులకు, అభిమానులకు, సినీ ప్రియులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం వన్ బై వన్ సిట్టింగ్ సామర్థ్యంతో థియేటర్లు తెరుచుకోవచ్చని కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో కరోనా థర్డ్ వేవ్ ఉందేమో అన్న ముందస్తు భయంతో నైట్ కర్ఫ్యూ రాత్రి 10 గంటల వరకు అమలు చేయడంతో ఆంధ్రాలో థియేటర్లు తెరుచుకో లేదు. కానీ కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆంద్రప్రదేశ్ లో జులై 31వ తేదీ నుంచి దియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వంఅనుమతి ఇచ్చింది. 50 శాతం సిటింగ్ సామర్థ్యంతో థియేటర్లు నడిపించాలని ప్రభుత్వం సూచించింది. అయితే 50 శాతం సిట్టింగ్ సామర్థ్యం తో దియేటర్ తమకు నష్టమని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని థియేటర్ యజమానులు చెబుతున్నారు.ఏపీ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీటింగ్ విజయవాడ గాంధీనగర్ ఫిలింఛాంబర్ లో జరిగింది. 13 జిల్లాల నుండి మీటింగ్ కు హాజరైన థియేటర్ యజమానులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం థియేటర్ నడపలేమంటోన్న ఓనర్స్. రేట్ల ఫ్లై క్లారిటీ వచ్చేక థియేటర్ ఓపెన్ చేయాలని నిర్ణయం. ఏపీ సినిమా థియేటర్లలో టికెట్లు రేట్ల పై రచ్చ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని థియేటర్ యజమానులు కోరారు. ” కరెంట్ బిల్లులు ” మాఫీ చేయమని ” టికెట్స్ రేట్స్ పెంచమని ” థియేటర్ యాజమాన్యాలు కోరారు.
ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని అలా రాయితీ ఇచ్చిన సమక్షంలో ” థియేటర్ యాజమాన్యాలు” తోపాటు థియేటర్స్ లో పనిచేసే వందలమంది ఉద్యోగులకు జీవనోపాధి కలుగుతుందని అప్పుడు 100% థియేటర్లు పూర్తిగా ఓపెన్ చేయగలమని థియేటర్ యాజమాన్యాలు కోరారు. మాకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉందని మాకు 100% సిట్టింగ్ సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయం చేస్తారని కోరుకుంటున్నామని ” తార స్కీన్స్ మేనేజర్ ” విజయవాడ ‘ శాసనాల బోసుబాబు ‘ తెలిపారు గతంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సామర్థ్యంతో థియేటర్లు నడుము కోవచ్చని అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుసుకోవడం. ఎప్పటినుంచో విడుదల కోసం ఎదురు చూస్తున్నా సినిమాలు. విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ శుక్రవారం సత్యదేవ నటిస్తున్న ‘తిమ్మరుసు’, తేజ- ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్న ‘ఇష్క్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.