తిరుపతి నగరంలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు

తిరుపతి నగరంలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు

త్రిచక్ర యాప్ ద్వారా ఆటో యొక్క వివరాలన్నీ నమోదు.

భద్రత దృష్ట్యా ప్రత్యేక కార్యచరణ

తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్…

నగరంలోని ఆటోలకు త్రిచక్ర యాప్ ద్వారా ప్రత్యేక గుర్తింపు.

నగరములోని ఆటోల యజమానులు త్రిచక్ర యాప్ ను ప్లే స్టోర్ నందు డౌన్లోడ్ చేసుకోవాలి.

 ప్రతి ఆటో దారుడు తప్పకుండా పూర్తి వివరాలతో యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

నకిలీ వాహనాలను సులభంగా గుర్తించే అవకాశం.

 ప్రయాణికులకు పూర్తిస్థాయిలో భద్రత.

ప్రయాణికులు ఉన్నచోట నుండి యాప్ ద్వారా బుక్ (Ola, Uber లాగా) చేసుకునే సదుపాయం.

ప్రయాణికులు పయనించు మార్గాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

దీని వల్ల ఆటో యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

ప్రతి ఆటోకు ఒక QR కోడ్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా ప్రయాణికులతో నేరుగా సంప్రదించవచ్చు.

ప్రయాణికులకు, ఆటో డ్రైవర్లకు మరియు పోలీసులకు ఉపయోగకరం.

 

చిత్తూరు జిల్లా:తిరుపతి, నగరం మహా పుణ్యక్షేత్రం. ఇక్కడ దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం వస్తూ ఉంటారు. ముఖ్యంగా నగరంలో ఎక్కువ భాగం ఆటోల పైనే ఆధారపడుతారు. భద్రత దృష్ట్యా నగరములో ఉన్న ఆటోలకు కూడా ఒక గుర్తింపు ఉండాలనే ఉదేశంతో మరియు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు ఎదురు కాకుండా ఉండాలనే ఉదేశంతో త్రిచక్ర యాప్ ను తయారు చేయడం జరిగింది.

నగరంలో ఉన్న ఆటో దారులందరు తప్పకుండా ఆటో మరియు డ్రైవర్/యజమాని యొక్క పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా పొందుపరచాలి. ఆటో కావాలసిన ప్రయాణికులు వారు ఉన్న చోట నుండే యాప్ ద్వారా సులభంగా వారి వద్దకు ఆటో ను రాప్పించుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు ప్రయాణించే మార్గాలను మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ యాప్ పోలీస్ స్టేషన్ నందు అనుసందానమై ఉన్నందున ఆటో ఎక్కదాక్ వెళుతున్నది, ఎక్కడ ఆగినది అనే పూర్తి వివరాలు పోలీసులకు సమాచారం తెలుస్తుంది. దీని వలన ప్రయాణికులు పూర్తి భద్రతతో సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరవచ్చు.

నకిలీ ఆటోలను మరియు కొత్త వ్యక్తులను కూడా సులభంగా గుర్తించవచ్చు. ప్రతి ఒక ఆటో కు QR కోడ్ ఉన్నందున అనుకోని సంగటనలు జరిగినప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాత్రికులు, ప్రజలు కూడా ఈ సదుపాయం ద్వారా వినియోగించుకోవాలని అందరు సురక్షిత భద్రత పొందాలని అలాగే ఆటో డ్రైవర్లు, యజమానులు ఇందుకు సహకరించి విజయవంతం చేసి తిరుపతికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరుకుంటున్నాననని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు తెలియజేసారు. 

యాప్ యొక్క వివరాలు:

ప్రజలు:

  1. ప్లేస్టోర్ నుంచి త్రిచక్ర సిటిజెన్ అప్ ని డౌన్లోడ్ చేసుకోవలెను.
  1. మీ పేరు మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.
  1. రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీ వాలిడేషన్ ద్వారా లాగిన్ అవ్వవలెను. 
  1. Nearby బటన్ మీరు click చేస్తే మీకు దగ్గర లో ఉన్న ఆటో ల వివరాలు వాటి ఫోన్ నెంబర్ లతో పాటు  

మీరు స్క్రీన్ పైన చూడవచ్చును. మీకు నచ్చినటువంటి ఆటో డ్రైవర్ కి ఫోన్ చేసి మీరు వెళ్ళవలసిన 

ప్రదేశానికి వెళ్ళవచ్చు. 

QR స్కాన్ విధానం:

  1. Dashboard నందు QRస్కానర్ ని ఉపయోగించి మీరు ప్రయాణిస్తున్న ఆటోలో ఉన్న QRకోడ్ ను స్కాన్ చేసుకోవలెను. 
  1. QR స్కాన్ విధానం ద్వారా మీరు ప్రయాణిస్తున్న ఆటో వివరాలు మీరు సేవ్ చేసుకోవచ్చు. మీ ప్రయాణం లో మీ లొకేషన్ తో పాటు మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవచ్చు. 
  1. ఆపద సమయంలో పోలీస్ వారికీ కూడా మీ లొకేషన్ ని షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసిన తరువాత మీ సురక్షణ కోసం పోలీస్ వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటారు. 

ఆటో యాజమాని:

  1. ఆటో డ్రైవర్లు ప్లేస్టోర్ నుంచి త్రిచక్ర అనే ఆప్ ని  డౌన్లోడ్ చేసుకొని మీ పేరు మీ మొబైల్ నెంబర్ డిస్ట్రిక్ట్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవలెను. 
  1. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వాలిడేషన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు.
  1. లాగిన్ అయిన తర్వాత మీ ఆటో యొక్క వివరాలు(ఆటో నెంబర్, ఆటో ఫోటో మొ.), ఆటో ఓనర్ యొక్క వివరాల(ఓనర్ ఫోటో, ఫోన్ నెంబర్, లైసెన్స్ ఫోటో మొ.) డాక్యూమెంట్లను ఆప్ లో అప్లోడ్ చేయాలి.
  1. మీరు అప్లోడ్ చేసిన డాకుమెంట్స్ ని మీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు చెక్ చేసి మీకు అప్రూవల్ ఇచ్చిన తరువాత మీకు పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జెనెరేట్ అయిన తరువాత మీకు QR కోడ్ ఉన్న స్టికర్ ఇవ్వటం జరుగుతుంది. .
  1. మీకు స్క్రీన్ పైన ఒక Online/Offline అనే ఒక బటన్ ఉంటుంది. ఆన్లైన్ గ్రీన్ కలర్ లో పెట్టుకుంటే మీకు దగ్గర లో ఉన్న ప్రజలు మీకు ఫోన్ చేయటం ద్వారా మీకు బాడుగలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.

:పోలీస్:

  1. ప్లే స్టోర్ నుంచి త్రిచక్ర ఆప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పోలీస్ అధికారి తన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. 
  1. లాగిన్ అయిన తరువాత QR స్కానర్ ద్వారా  ఆటో మరియు ఆటో డ్రైవర్ యొక్క వివరాలను పరీక్షించవచ్చును. 
  1. ఆటో యొక్క వివరాలని ఆటో డ్రైవర్ మొబైల్ నెంబర్ (లేదా) ఆటో నెంబర్ (లేదా) పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా కూడా ఆటో  వివరాలను పరీక్షించవచ్చును. 
  1. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న అధికారికి  వారి స్టేషన్ పరిధిలో ఉన్నటు వంటి ఆటోల యొక్క వివరాలు చూసి వాటికీ అప్రూవల్ ఇచ్చిన తరువాత పోలీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జెనెరేట్ అవుతుంది.

ఈ కార్యక్రమంలో డి.యస్.పి లు ట్రాఫిక్ ట్రాఫిక్ I మల్లికార్జున, II కాటమరాజు, సి.ఐ హరిప్రసాద్ ఆటో డ్రైవర్లు, యజమానులు పాల్గొన్నారు.

About The Author