రాష్ట్రంలో ఉన్న 59 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కు అవసరమైన నీటిని…

రాష్ట్రంలో ఉన్న 59 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కు అవసరమైన నీటి వివరాలను లొకేషన్ల వారిగా మ్యాపులతో జనవరి 27 నాటికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మిషన్ భగీరథ పై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సి.యం.ఓ కార్యదర్శి శ్రీమతి స్మితాసబర్వాల్, టీఎస్ ఐఐసి ఎం డి వెంకటనర్సింహారెడ్డి, ఇరిగేషన్ ఈ ఎన్ సి మురళీధర్ రావు, మిషన్ భగీరథ ఈ ఎన్ సి కృపాకర్ రెడ్డి, మెట్రోవాటర్ వర్క్స్ డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. TSIIC ద్వారా ఫార్మసిటి, NIMZ, టెక్స్టైల్ పార్క్ , Medical devices Park, MSME, Electronic Manufacturing Cluster, Chandan Valley Industrial Park లాంటి పారిశ్రామిక క్లస్టర్లకు అవసరమైన Raw, treated water అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించి అనుగుణంగా వివరాలను సమర్పించాలని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా పారిశ్రామిక పార్కుల వద్దకు బల్కు గా సప్లయిచేయాలని ఇంటర్నల్గా TSIIC ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. వచ్చే 20, 25 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని డిమాండ్ ను అంచనా వేయాలన్నారు.మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల కనుగుణంగా 12755 గ్రామపంచాయతీలలో 118 అర్బన్ లోకల్ బాడీ లలో 23,968 ఆవాసాలకు కు మంచినీటి సరఫరాను మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందిస్తున్నామన్నారు. ORR పరిధికి ఆవల మంచినీటి సరఫరాను మిషన్ భగీరథ చేయవలసి ఉందని, ORR లోపల మెట్రోవాటర్ వర్క్స్ ద్వారా సరఫరా చేయాలని అన్నారు. ORR పరిధిలో గ్రామాలు, హౌసింగ్ కాలనీలు, గెటెడ్ కమ్యూనిటీలు, ULB లకు మంచినీరు అందించడానికి మెట్రోవాటర్ వర్క్స్ అధికారులు పనులు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే పలుచోట్ల మంచినీటి సరఫరా జరుగుచున్నదని, ఇంకా కవర్ కాని ఇండ్లకు మంచినీటి సరఫరాకు పనులు పూర్తి చేయాలన్నారు.urbanization ను దృష్టిలో ఉంచుకొని పనులు
చేయాలన్నారు. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ ల సమన్వయం చేసుకొని అనుమతి పొందిన లే అవుట్ లకు నీటి సరఫరా జరగాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంచినీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మంచినీటి డిమాండ్, సప్లయి, రిజర్వాయర్ల ద్వారా నీటిసరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. ఇప్పటికే గ్రామాలలో జరుగుతున్న మంచినీటి సరఫరాపై శాంపిల్ చెక్ చేయాలన్నారు.

About The Author