నాలుగు నెలల బాబు అపహరణ కేసును రెండు రోజులలో చేదించిన తిరుపతి పోలీసులు
తీత్ర యాత్రకు వచ్చు భక్తులు, యాత్రికులు అన్యస్తులను నమ్మరాదు.* తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.*
*జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్….*
✅ *2.8.2021 సాయంత్రం సుమారు 5:30 గంటలకు అలిపిరి లింక్ బస్ స్టాండ్ వద్ద 4 నెలల బాబు అపహరణ.*
✅ *రెండు రోజులలో అపహరణ కేసును చేదించిన పోలీసులు.*
✅ *నాలుగు నెలల బాబు కిడ్నాప్ కేసును చేదించిన అలిపిరి స్టేషన్ పోలీసులు.*
✅ *బిక్షాటన చేసుకునే మైసూర్ కు చెందిన ఆశాగా గుర్తింపు.*
✅ *అలిపిరి సిబ్బందిని అభినందించిన జిల్లా యస్.పి. గారు.*
తిరుపతి 2.8.2021 తేది అలిపిరి వద్ద ఉన్న బాలాజీ లింక్ బస్టాండ్ లో నాలుగు నెలల బాబు అపహరణకు గురిఅయింది. గంగులమ్మ, వీరభద్రయ్య అనే వారు రొంపిచర్ల మండలం వాస్తవులు. తిరుపతి అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద ఉండి నగరములో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు.
2.8.2021 తేది నాడు గంగులమ్మ తన నాలుగు నెలల బాబును అక్కడే తనకు పరిచయమున్న యాచాకురాలు ఆశా అనే ఆమెకు స్నానం చేసి వచ్చే వరకు బాబును చూసుకోవాలని తనకు అప్పగించి స్నానానికి వెళ్ళింది.
ఇదే అదునుగా భావించిన ఆశా బాబును దుర్బుద్ధితో అపహరించింది. స్నానం చేసుకొని వచ్చిన గంగులమ్మ తన బాబు యాచాకురాలు ఆశా ఇద్దరు కనిపిచాకపోయేసరికి చుట్టూప్రక్కలంతా వెతికినా కనిపించ లేదు. తదుపరి గంగులమ్మ వీరభద్రయ్యలు అలిపిరి పోలీసులను ఆశ్రయించారు.
వెంటనే స్పందించిన అలిపిరి పోలీస్ స్టేషన్ సి.ఐ దేవేంద్ర కుమార్ కేసు నమోదు చేసి జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారికి కేసు విషయాలను తెలియపరిచి వారి ఉత్తర్వు మేరకు ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేసారు. అలాగే బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద ఉన్న సిసి కెమెరాలను పరిశీలించి వాటిలో కనబడిన ఆధారాలతో అపహరించిన వ్యక్తి యచకురాలు ఆశా యే నని గుర్తించి ఆ దిశగా కేసును వేగవంతం చేసి పురోగతి సాదించడం జరిగింది.
ఈ రోజు ఉదయం 11:30 గంటలకు తిరుపతి నందు అపహరించిన వ్యక్తి ఆశా ను తిరుపతి రైల్వే స్టేషన్ నందు అరెస్ట్ చేసి 4 నెలల బాబును స్వాదీన పరుచుకొని జిల్లా యస్.పి గారి చేతుల మీదుగా జిల్లా యస్.పి కార్యాలయం వద్ద బాబును తన తల్లిదండ్రులకు అప్పగించడం జరిగినది.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ తిరుపతి ఆద్యాత్మిక నగరం కాబట్టి చాలా మంది భక్తులు, యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. వారికి కావలసిన భద్రతా పరమైన ఏర్పాట్లు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ వారు అప్రమత్తతో జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.
ముఖ్యంగా తిరుపతి పోలీస్ వారి తరపున ఓక చిన్న విన్నపం. భక్తలు, యాత్రికులు తీత్రయాత్రకు వచ్చినప్పుడు తాము జాగ్రత్తగా ఉండడంతోపాటు తమతో ఉన్న చిన్న పిల్లలలను అతి జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్త ప్రదేశాలు, కొత్త ప్రాంతాలలో ఉండవలసి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి.
ఇలాంటి సంఘటనలు పుణఃరావ్రుతం కాకుండా కార్యాచరణ చేస్తున్నాం. ఎక్కువ భాగంలో సి.సి కెమరాలను ఏర్పాటు చేస్తున్నాము. అలిపి లింక్ బస్ స్టాండ్, ఆర్.టి.సి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ మొదలగు ప్రాంతాలలో నిఘా పెచుతున్నాము. అదేవిధంగా తిరుపతి తిరుపతి దేవస్థానం వారితో కూడా మాట్లాడి భద్రతా పరమైన ఏర్పాట్లను వారితో చర్చించి తీవ్రస్థాయిలో నిఘాను పెంచుతామని ఈ సందర్భంగా జిల్లా యస్.పి శ్రీ వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ గారు తెలిపారు.
ఈ సందర్భంగా అపహరణ కేసులో విశేష ప్రతిభ కనుబరిచిన అలిపిరి సి.ఐ దేవేంద్ర కుమార్, యస్.ఐ జయచంద్ర, హెచ్.సి రవి రెడ్డి, పి.సి ప్రసాద్ వారిని జిల్లా యస్.పి గారు అభినందించి నగదు రివార్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి అడ్మిన్ శ్రీమతి ఇ.సుప్రజ మేడం గారు, సి.ఐ దేవేంద్ర కుమార్, యస్.ఐ జయచంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు.