ఈరోజు చిత్తూరు జిల్లా కి మంచి రోజు…
ఈరోజు చిత్తూరు జిల్లా కి మంచి రోజు అని చెప్పాలి, రాయలసీమ ప్రాంతం కరువు కాటకాలతో పస్తులతో ప్రజలు బాధపడడం మనం చదువుకున్నాం. దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం అని చెప్పబడే రాయలసీమ ప్రాంతం ఈరోజు సస్యశ్యామలమై కృష్ణాజలాలతో నిండుగా ఉంది. అనంతపురం చెరువులన్నీ నిండి పొంగి పొర్లుతున్నాయి. కడప జిల్లా కూడా ఇప్పటికే చాలా చెరువులు నిండి ఇప్పుడు చిత్తూరు జిల్లా కి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ” మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట విన్నాను అందులో గల గలా గోదారి కదలి పోతుంటేను బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి” ఉంటుంది అది ఇన్ని రోజులకి రాయలసీమ కు సాకారమైంది. ఎక్కడ కృష్ణమ్మ ఎక్కడ రాయలసీమ ఎక్కడికి ఇంత దూరం ప్రవహిస్తూ రైతులు పంట పండించడానికి. అందరి దాహాన్ని తీరుస్తూ ప్రవహిస్తూ ఈరోజు మా జిల్లా కి వచ్చింది కృష్ణమ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రభుత్వం చేతల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ఏదైనా చేస్తాను అంటే చేసి చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాము. ఇక్కడ రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.