ఎమ్మెల్యే భూమన కు కృతజ్ఞతలు తెలిపిన ఎం ఎన్ ఓ లు, ఎఫ్ ఎన్ ఓ లు….
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి స్థానిక రుయా ఆసుపత్రి ఎఫ్ ఎన్ ఓ లు, ఎం ఎన్ ఓ లు గా కృతజ్ఞతలు తెలిపారు. రెండు వారాల కిందట వీరిని విధుల నుంచి అధికారులు తొలగించగా…
భూమన కరుణాకర రెడ్డి అదేశాల మేరకు బుధవారం యథావిధిగా విధుల్లో కొనసాగించారు. ఈ సందర్భంగా బుధవారం పద్మావతి పురం లోని భూమన నివాసం వద్దకు చేరుకొని కృతజ్ఞతా పూర్వకంగా సత్కరించారు. వీధిన పడిన 41 కుటుంబాలను ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి ఆదుకున్నారని ఎం ఎన్ ఓ లు, ఎఫ్ ఎన్ ఓ లు తెలిపారు.సీపీఎం నాయకులు కందారపు మురళి, నాగరాజు సహా ఎం ఎన్ ఓ లు, ఎఫ్ ఎం ఓ ల ప్రతినిధులు పూర్ణిమ, వేదవతి, సుబ్రమణ్యం, విజయానందం, ప్రసాద్, లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు