స్వాతంత్ర్య వీరుల త్యాగాలను స్మరించుకుందాము… ఎమ్మెల్యే భూమన
చిత్తూరు జిల్లా:తిరుపతి,భారతదేశం పరపీడన నుండి తప్పించి స్వాతంత్ర్య భారతవని సాధించిన స్వాతంత్ర్య వీరులను ఎప్పటికీ స్మరించుకుందామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు.*
*75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా మైదానంలో ఆదివారం ఘనంగ నిర్వహించారు.*
*మొదట తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా జాతీయా పతకాన్ని అతిథుల సమక్షంలో ఆవిష్కరించగా, అతిథులు శాంతికి చిహ్నంగ పావురాలను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు.*
*తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గిరీష ఐ.ఏ.ఎస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తిరుపతి అభివృద్ధికి మరిన్ని పథకాల అమలుకు కార్యచరణ రూపొందిస్తూన్నట్లు వివరించారు.*
*తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ మహనీయుల వలన స్వాతంత్ర్యం లభించిన విషయం మనకందరికి తెలుసునని,వారి దేశభక్తిని మనం అలవర్చుకోవాలన్నారు.ఈరోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం తొట్టతొలిసారిగా సమాజంలో వున్న అట్టడుగు వర్గాల యొక్క ప్రజల జీవన సాపల్యాన్ని మెరుగుపరచడానికి,వారి కళ్ళల్లో కాంతులు నింపడానికి ఒక ఆదర్శనీయమైనటువంటి సంక్షేమ ప్రభుత్వంగా మారి ఇప్పటికే దాదాపు 1 లక్షా 15 వేల కోట్ల రూపాయలను నేరుగా బడుగు ప్రజల ఖాతాల్లోకి జమ చేసి ఇంత గొప్ప దార్శనీకూడు నాయకుడు మన ముఖ్యమంత్రేనని మన్నలు పొందుతూ, సమాజంలో ఉన్న అట్టడుగు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్లు, దిగువ మధ్యతరగతి వాళ్ళు 60 శాతం మందికి పైగా వున్న ప్రజలందరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలపట్ల సంపూర్ణ వంతమైన విశ్వాసాన్ని,ఆశీస్సులు అందజేస్తున్నారని భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు.ఇటివల తిరుపతి మునిసిపల్ ఎన్నికల్లో 49 మందికి గాను 48 మంది కార్పొరేటర్లు గెలవడం,మొన్న జరిగిన తిరుపతి ఎం.పి. ఉప ఎన్నికలో డాక్టర్ గురుమూర్తి అఖండ మెజార్టితో గెలవడం జగన్ మోహన్ రెడ్డి పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పన్నారు.తిరుపతిలో కరోనా కట్టడికి అన్ని ప్రాంతాల కన్న ముందు కదిలింది నగరపాలక సంస్థ అధికారులు,కార్మికులు,కార్పొరేటర్ల సమన్వయంతోనేనని గుర్తుచేసారు.జగనన్న అభిమానులు ముస్లిం జేఏసిగా ఏర్పడి 800 పైగా ఆనాధ కరోనా మృత దేహాలకు ఖననం చేసిన గొప్ప విషయం తిరుపతి వాసులదేనని,తిరుపతి పుణ్యక్షేత్రంలో మాదక ద్రవ్యాల నివారణకు దండెత్తడం జరిగిందని గుర్తు చేస్తూ,మొట్ట మొదటిసారిగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డి.అడిక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తుండడం గొప్ప విషయమని అబినందిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఎమ్మెల్యే భూమన తెలియజేసారు.*
*మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వెనుక ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం, సుదీర్ఘ పోరాటం ,బలిదానాలు ఉన్నాయని గుర్తు చేస్తూ మన దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సమరయోధులను మనం ఎప్పుడూ గౌరవించుకోవాలన్నారు. భారత దేశ పౌరులుగా ఈ రోజున వీరందరినీ స్మరించుకోవడంమే కాక వారు తెచ్చిపెట్టిన ఈ స్వేచ్ఛ స్వాతంత్య్రాలను కాపాడుకోవడం కూడా మన అందరి బాధ్యత అని అన్నారు. భారతదేశ పౌరులుగా దేశ అభివృద్ధికి,సమైక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ మేయర్ గా తన సహచర కార్పోరేటర్లతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను నెరవేర్చేలా,తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో తిరుపతి నగర అభివృద్ధికి అన్ని విధాల తోడ్పడుతామని మేయర్ డాక్టర్ శిరీషా అన్నారు*
*తిరుపతి ఎం.పి.డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర్య చరిత్రలో భారత్ ప్రప్రంచంలోనే అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిందన్నారు.రాష్ట్రంలో జాతిపిత మహాత్మాగాంధీ స్పూర్తితో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసి ప్రజల ముంగిటకే పరిపాలన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు.తామున్న గ్రామాల్లోనే వైధ్య సేవలు పొందేలా గ్రామ ప్రజలకు దేశంలోనే విలేజ్ హెల్త్ క్లీనిక్లును జగనన్న ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.తిరుపతి అభివృద్ధికి నిరంతరం ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సూచనలు ముందుకెలుదామని ఎం.పి.డాక్టర్ గురుమూర్తి అన్నారు.*ఎం.ఎల్.సి యండపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ త్యాగదనుల కృషితో సాధించిన స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం సంతోషమన్నారు.తిరుపతి అభివృద్ధికి అన్ని విదాలా కృషి చేస్తానన్నారు*
*అతిథుల ప్రసంగాల అనంతరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు విథ్యార్థులు సంస్కృతి కార్యక్రమాలు,యోగా విధ్యార్థుల విన్యాసా ప్రదర్శన సభికులను ఆకట్టుకున్నాయి.*
*పి.హెచ్.సి మెడికల్ ఆఫిసర్లకు,శానిటరి కార్మికులకు,విధ్యార్థులకు, బ్యాంకర్ల ప్రతినిధులకు,అధికారులకు ప్రసంసాపత్రాలను అందజేసారు.*
*ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ,కార్పొరేటర్లు,కో.ఆప్సన్ సభ్యులు,అదనపు కమిషనర్ హరిత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎస్.ఈ మోహన్,హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ,ఆర్వోలు సేతుమాధవ్,గాలి సుధాకర్,అధికారులు జ్ఞాన సుందరం, రామచంద్ర,హాసిమ్,షణ్ముగం,దేవిక,గోమతి,రవి,చెంచయ్యలు పాల్గొన్నారు.*