భారత్‌లో మరో ఇంజనీరింగ్ అత్యద్భుతం..


★’భారత్‌లో మరో ఇంజనీరింగ్ అత్యద్భుతం’★
★మొదటి నిలువు లిఫ్ట్ సముద్ర రైల్వే వంతెన★
★రామేశ్వరం,రామ సేతుకు మరింత సౌకర్యం★
“భారతీయ రైల్వే నిలువు లిఫ్ట్ తో కూడిన తొలి సముద్రపు వంతెనను పూర్తి చేయబోతున్నది. రూ 280 కోట్లతో నిర్మిస్తున్న ఈ వంతెన భారత దేశానికి చెందిన పంబన్ ద్వీపంలోని రామేశ్వరాన్ని తమిళనాడులో ప్రధాన భూభాగమైన మండపంతో కలుపుతుంది”
“ప్రస్తుతమున్న బ్రిడ్జి బ్రిటిష్ కాలం నాటిది ( 107 సంవత్సరాల క్రితం ) కావడంతో బాగా పాతబడిపోయి రాకపోకలు నిలిచి పోయే పరిస్థితి ఏర్పడింది. నూతన బ్రిడ్జి 2.07 కిలోమీటర్ల పొడవు కలిగి మధ్యలో 63 మీటర్ల నిలువు లిఫ్ట్ కలగి ఉన్నది”
“ఓడలు రాకపోకలు సమయంలో ఈ నిలువు లిఫ్ట్ ఎత్తకు చేరకుంటుంది. ఆ తరువాత మళ్లీ రైళ్ల రాకపోకలు కోసం కిందికి చేరుతుంది.ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రామేశ్వరంతో పాటు రామా సేతుకు రాకపోకలు మరింతగా పెరుగుతాయి”
“ఈ పనులకు నవంబర్ 8, 2019న ప్రధాని నరేంద్ర మోది గారు శంకుస్థాపన చేశారు. వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు చేపడుతున్నారు.ప్రస్తుతం ఉన్న వంతెన కంటే 3 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ కొత్త వంతెన భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలువబోతున్నది”

About The Author