చంద్ర‌బాబు మాట‌కే ప్రాధాన్య‌త‌…

 

చంద్ర‌బాబు మాట‌కే ప్రాధాన్య‌త‌..
కాంగ్రెస్ అధినేత ఇంటికి వెళ్లి మ‌రీ పొత్తు మైత్రి కుదుర్చుకున్న టిడిపి అధినేత చంద్ర‌బాబు మాట‌కే తొలి నుండి రాహుల్ గాంధీ మ‌ద్ద‌తు ఇస్తున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారం లో భాగంగా..హైద‌రాబాద్ లో ఓ హోట‌ల్ లో స‌మావేశమైప స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఏపిలో పొత్తుల పై చ‌ర్చ జ‌రిగింది. ఏపిలో కాంగ్రెస్ – టిడిపి క‌లిసి వెళ్లాలో .. విడివిడిగా పోటీ చేయాలో నిర్ణ‌యించే అధికారాన్ని రాహుల్ గాంధీ..చంద్ర‌బాబుకే అప్ప‌గించారు. ఇక‌, తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల ఈ ఇద్ద‌రి పొత్తు పై ప్ర‌భావం చూపించాయి. ఏపిలో టిడిపి నేత‌లు కాంగ్రెస్ తో పొత్తు వద్ద‌ని పార్టీ అధినేత ను కోరారు. చంద్ర‌బాబు సైతం పొత్తు పై స‌ర్వేలు చేయించారు. సానుకూల‌త లేకపోవ‌టంతో పొత్త కంటే..విడివిడిగా పోటీ చేసి క‌లిసి ఉండ‌టం మంచిద‌నే అభిప్రాయానికి వ‌చ్చారు. అంతే , ఇదే విష‌యాన్ని ఢిల్లీ ప‌ర్య ట‌న‌లో భాగంగా..రాహుల్ కు వివ‌రించారు. వెంట‌నే రాహుల్ సైతం ఓకే చెప్పేసారని స‌మాచారం.

About The Author