మనదేశపు కోడలు సోనియానా? ఎమిలీ యా?…
పురాణాలతోపాటు దేశంగురించి కూడా తెలుసుకోవాలని పెట్టాము తప్పైతే క్షమించండి
మనదేశపు కోడలు సోనియానా? ఎమిలీ యా?…
ఒకసారి 1940 వ దశకం లోకి వెళదాం. ఈ కథ ఒక జర్మన్ మహిళది. పేరు #Emilie_Schenkl. ఈ పేరు మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు. విని ఉండకపోయినా , తప్పు మీది కానే కాదు. చరిత్రపుటల నుంచి ఈమె పేరుని మాయం చేసిన చరిత్రకారులదే.
ఈమె 1937 లో ఒక భరతమాత ముద్దుబిడ్డ ని వివాహం చేసుకున్నది. మెట్టినింటిగా ఆమె భారతదేశాన్ని వరించినా , ఆమె దురదృష్టంకొద్దీ ఏనాడూ ఈదేశం ఆమెకు స్వాగతం పలుకలేదు. ఆమెకోసం మంగళగీతాలు పాడలేదు. ఆమెను గురించిన చర్చని కూడా ఈదేశం ప్రజలు ఏనాడూ చేయలేదు. ఆమె ఎలా బతుకుతున్నదో కూడా పట్టించుకోలేదు.
7 ఏళ్ళ వైవాహిక జీవితంలో తాను భర్తతో గడిపినది 3 సంవత్సరాలు మాత్రమే. తనను , తన పిల్లను వదిలేసి భర్త బయలుదేరి వెళ్ళిపోయాడు. ముందు తన దేశానికి స్వాతంత్ర్యం తీసుకునిరావాలనీ , అనంతరం హాయిగా దేశానికి వెళతాననీ చెప్పాడు. అయితే అలా జరగలేదు. 1945 వ సంవత్సరంలో తన భర్తను విమాన ప్రమాదంలో మరణించినట్లుగా ప్రకటించింది.
అప్పటికి #ఎమిలీ యువావస్థలోనే ఉన్నది. తాను తలచుకుంటే , పాశ్చాత్యసంస్కృతి ప్రకారం హాయిగా మరొక వివాహం చేసుకుని శేషజీవితాన్ని గడిపేసేది. కానీ , ఆమె అలా చేయలేదు. సంఘర్షమయ జీవితాన్నే ఎంచుకున్నది.
ఎంతో తక్కువజీతానికి టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ, కూతురిని పెంచుతూ వచ్చింది. ఎవరినుంచీ ఏమీ ఆశించనూ లేదు, ఎవరిమీద ఫిర్యాదు చేయనూ లేదు. ఇంతలో భారతదేశం పూర్తి స్వతంత్రదేశమయ్యింది. తన భర్త ఏదేశంకోసం పోరాడాడో ఆ దేశం స్వాతంత్ర్యమయినదని సంతసించి ఒకసారి భారత్ ను చూడాలని ఆశ పడింది.
కానీ ఈ దేశంలో ఒక కుటుంబం ఈ మహిళ భారత్ వస్తోందని తెలిసి గజగజ వణికిపోయింది. ఏ మహిళకయితే సమ్మానపూర్వకంగా మనదేశ పౌరసత్వాన్ని ఇవ్వాలో , ఆ మహిళకు వీసా కూడా జారీ చేయకుండా ఇబ్బందులపాలు చేసింది. చివరకు ఆమె కష్టాలతో కూడిన జీవనాన్నే గడుపుతూ 1996 లో దూరంగానే తన తనువు చాలించింది.
ఆమె పూర్తిపేరు #ఎమిలీ_షెంకల్_బోస్ . ఈ దేశం ఎంతో ప్రేమించిన , గౌరవించిన , అనుసరించిన జననాయకుడు సుభాష్ చంద్రబోస్ ధర్మపత్ని ఆమె. ఆతల్లిని ఈ దేశం రాకుండా గాంధీ-నెహ్రూలు ఎంతగా కుట్రలు పన్నారో మీరు ఊహించవచ్చు. ఆమె ఈదేశంలో అడుగుపెడితే భారతప్రజలు ఆమెను నెత్తిన పెట్టుకుంటారని పసిగట్టిన ఆ జంట , తమ రాజకీయజీవితానికి ఆమె స్వస్తి పలుకగలదని విశ్వసించింది. ఆమె వచ్చి ఉంటే , అదే జరిగేదేమో.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం , వాళ్ళచే నామకరణం , అక్షరాభ్యాసం చేయబడ్డ పత్రికా ప్రపంచం , విదేశీయుల మోచేతినీళ్ళు తాగే పత్రికాధిపతులు , ఎలక్ట్రానిక్ మీడియా వారు ఆంటోనియో మాయినో ఉరఫ్ సోనియాని ఈదేశపు కోడలుగా ప్రకటిస్తూ ప్రజలను వెర్రివాళ్ళను చేసేసారు.
మిత్రులారా ! మీరు చెప్పండి. అసలు సోనియాకు , ఎమిలీబోస్ కు పోలిక ఉన్నదా? వారిద్దరూ ఒకటేనా ? ఎమిలీబోస్ పడ్డ కష్టాలముందు , సోనియావి అసలు కష్టాలా? ఈ ఇద్దరిలో మనదేశపు కోడలు ఎవరో మీరే చెప్పండి.
భారత్ మాతా కీ జై