అలిపిరి నడక దారిలో మరో చిరుత సంచారం…
తిరుమల మెట్ల మార్గంలో మరో చిరుత కనిపించింది.
అధికారులు ఆ మార్గంలో 400 ట్రాప్ కెమెరాలు అమర్చగా.
చాలా చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు.
ఈ బోనుల్లో ఇప్పటికే 2 చిరుతలు చిక్కుకున్నాయి.
అయితే ఆగస్టు 22 అర్ధరాత్రి 7వ మైలు దగ్గర మరో చిరుత కదలికను అధికారులు గుర్తించారు.
చిరుతకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.
కెమెరాకు సమీపంలోనే బోను ఏర్పాటు చేసినా చిరుత చిక్కలేదు.