ఓ మై ఫ్రెండ్…పాట

https://www.facebook.com/474123499353156/posts/1961855360579955/

నేను తానని అనుకుంటారా….
నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే …
మా తప్పంటారా….
ఆడ మగ అని తేడా వుందని అబిమానానికి చెబుతారా
స్నేహం మెహం రెండు వేరని తెలిసీ… తప్పుకుపోతారా…

ఒక చోటే వుంటూ ఒకటే కలగంటూ
విడివిడిగా కలిసే వుండే కళ్ళది ఏ బంధం
కలకాలం వేంటే నడవాలనుకుంటే
కాళ్ళకి ఓ ముడి వుండాలని ఎందుకు ఈ పంతం
చుట్టరికముందా చెట్టుతో… పిట్టకే హో..
ఏం లేకపోతే గూడు కడితే నేరమా…
ఎ చెలిమి లేదా గట్టుతో ఎటీకే…. హో
వివరించమంటే… సాధ్యమా…

నేను తానని అనుకుంటారా…. నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా….
ఆడ మగ అని తేడా వుందని అబిమానానికి చెబుతారా
స్నేహం మెహం రెండు వేరని తెలిసీ… తప్పుకుపోతారా..

కనులకు కనిపించే రూపం లేకుంటే
ప్రాణం తానునన్నా నమ్మం అంటారా….
చెవులకి వినిపించే సవ్వడి చేయందే
గుండెల్లో కదిలే నాదం లేదని అంటారా
మదిలోని బావం మాటలో .. చెప్పకుంటే
అటువంటి మౌనం తగనిదంటూ అర్దమా…
తీరాన్ని నిత్యం అల అలా తాకుతుంటే
నిలిపే నిషేదం న్యాయమా…
నేను తానని అనుకుంటారా….

నేను తానని అనుకుంటారా…. నేనే తానని అనుకోరా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా….
ఆడ మగ అని తేడా వుందని అబిమానానికి చెబుతారా
స్నేహం మెహం రెండు వేరని తెలిసీ… తప్పుకుపోతారా…

Movie: Oh My Friend

Lyrics: Seetharama Sastry
Music: Rahul Raj
Singers: Ranjith

About The Author