హరిహర వీరమల్లు – మువీ రివ్యూ


నేను ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను అని పవన్ పాత డైలాగ్ .. ప్రారంభం అయిన ఐదేళ్ళ క్రితం విడుదల అయి ఉంటే ఆ డైలాగ్ ఇపుడు కూడా సెట్ అయ్యేది కాకపోతే ఇపుడు సనాతనం అనే ట్రెండ్ ఫాలో అయినట్లుంది. హరిహర వీరమల్లు చారిత్రక నేపథ్యం లో తీసిన సనాతన సినిమా. ప్రథమార్థంలో ఒక లక్ష్యం కోసం బందరు నుంచి గోల్కొండ దాకా వీర పోరాటం సాగిస్తే ద్వితీయార్థం మరో లక్ష్యం కోసం గోల్కొండ నుంచి ఎర్రకోట వరకు ధర్మం వైపు గుర్రపు స్వారీ చేయాల్సి వస్తుంది. రెండు లక్ష్యాల కోసం తను దారి మార్చుకోవాల్సి వచ్చిందా లేక తాను అనుకున్న దారిలో ప్రధాన లక్ష్యం పెట్టుకున్నారా అనేది హరిహర వీరమల్లు కథాంశం.

పవన్ చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రలో నటించడం ఇదే ప్రథమం. ఆహార్యంలో మాటల్లో ప్రత్యేకత కనపడినా నటనలో ప్రత్యేకత లేదు. పాటలు పరవాలేదు అనిపిస్తాయి. నిధి అగర్వాల్ అందానికి మారుపేరు అనిపించినా నటనకు అవకాశం లేదు. ఔరంగజేబు పాత్రకు తగిన బాబీ డియోల్. ఇతర పాత్రలు ఎన్నో ఉన్నాయి. అన్నీ కొనసాగుతూ ఉంటాయి. కీరవాణి నేపథ్య సంగీతం బాగుంది. సినిమాలో పెద్ద మైనస్ VFX దృశ్యాలు ప్రత్యేకించి గుర్రపు స్వారి సమయంలో ఆ లోపం స్పష్టంగా కనబడుతుంది. టైటిల్స్ లో బుర్రా ఉన్నా ముందే త్రివిక్రమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు టైటిల్స్ ముందే రాశారు. రాజకీయం సినిమా మిక్స్ చేసి మాటల తూటాలు రాయడంలో త్రివిక్రమ్ ప్రత్యేకత కనపడింది. పవన్ కూడా యాక్షన్ సీక్వెన్స్ తీసినట్లు టైటిల్స్ లో కనపడింది. ఫ్యాన్స్ కి అవే మిగిల్చిన గూస్ బంప్ దృశ్యాలు. కల్పిత పాత్ర కనుక చరిత్ర లోతుల్లోకి వెళ్లదలచుకోలేదు.

ప్రథమార్థంలో ఊహించని ఒక ట్విస్ట్ పై ఎన్నో అంచనాలు పెట్టుకుంటే ద్వితీయార్థంలో ఆ ట్విస్ట్ తుస్సుమని మరో ట్విస్ట్ వైపు అడుగులు. మతమార్పిడి కోసం మొఘల్ సామ్రాజ్యం లో ముస్లిం పాలకులు హిందువులపై దాడులు అనే అంశం మాత్రమే కథకు మూలం. హిందుత్వం సనాతన ధర్మం ప్రధాన కథాంశం కనుక పవన్ ఫ్యాన్స్ గా ఉన్న ఇతర మతస్థుల మనోభావాలను నొప్పించకుండా అక్కడక్కడ కొన్ని అసంధర్భోచిత దృశ్యాలు. రెండవ భాగంపై ఆసక్తికర ముగింపు లేకపోవడం మరో మైనస్.

మొత్తంగా బందరు నుంచి గోల్కొండ వైపు సాఫీగా వీరోచితంగా సాగితే గోల్కొండ నుంచి ఢిల్లీ వైపు గుర్రపు స్వారీ దారి తప్పి అస్సాం వైపు వెళుతున్న సమయంలో సనాతన ధర్మం ఎర్రకోట వైపు మళ్ళిస్తుంది. వీరమల్లు సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేది కథాంశం. సనాతన ధర్మం మాత్రమే పవన్‌ని కాపాడుతుందేమో అనేది సినిమా ఫలిత సారాంశం ✍️PPN

About The Author