బాలకృష్ణ కాదు కొంటె కృష్ణ..
రాష్ట్రమంతా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యూరియా అందించే హడావిడిలో ఉంటే…ఆ అధికారి మాత్రం ఆడోల్లకు లైన్ వేసే బిజీలో ఉన్నాడు.బాధ్యత మరిచి కింది స్థాయి మహిళా ఉద్యోగులకు సైట్ కొడుతున్నాడు.
సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖలో అధికారుల కీచక పర్వం కలకలం రేపుతోంది.తుంగతుర్తి మండల అగ్రికల్చర్ అధికారి బాలకృష్ణ తమను లైంగికంగా వేధిస్తున్నారని కింది స్థాయి ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.ఆఫీస్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ లు,అర్థరాత్రి కాల్స్ చేసి తిన్నావా,పడుకున్నావా అంటూ టార్చర్ పెడుతున్నారని బాధితులు వాపుతున్నారు.అధికారుల కీచక పర్వం ఉన్నతాధికారులకు చేరవేశారు భాదిత ఉద్యోగినులు.దాంతో కీచక అధికారులపై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్…
అయితే విచారణ జరుగుతున్న సమయంలోనే తుంగతుర్తి ఏవో బాలకృష్ణకు దేహశుద్ది చేసింది ఏఈవో మహిత.అందరి ముందు చెంప చెల్లుమనిపించింది.జరిగిన గోడు చెప్పుకుంటూ వీపు విమానం మోత మోగించింది.కాగా విచారణ అనంతరం ఏవో బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్.