ఒకటే వీధి రెండు రాష్ట్రాలు.. అటు అడుగేస్తే ఆంధ్రా, ఇటు తెలంగాణ..!
ఒక్కసీసీ రోడ్డు…రెండు గ్రామాలు. అంతే కాదు రెండు రాష్ట్రాలు. ఆ రెండు రాష్ట్రాలకు మధ్య సరిహద్దు గా మారింది ఆ సీసీ రోడ్డు. అదేంటి అని ఆలోచిస్తున్నారా..
జంట నగరాలు.. పేర్లు వినే ఉంటాం. అలానే రెండు రాష్ట్రాల నడుమ రెండు గ్రామాల మధ్య కొంతైనా సరిహద్దు ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వేంసూరు మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం కి కేవలం ఒక్క సీసీ రహదారే అడ్డు.
తూర్పు వైపు గా నిలబడితే కుడివైపు కృష్ణారావు పాలెం ఉండగా ఎడమవైపు వెంకటపురం గ్రామాలు ఉన్నాయి. సీసీ రోడ్డు మీద నిల్చుని ఒక అడుగు అటు వేస్తే…ఆంధ్రా రాష్ట్రం. ఒక అడుగు ఇటువైపు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టినట్టే. ఆ గ్రామానికి సరిహద్దు గా ఉన్న సీసీ రోడ్డు రెండు రాష్ట్రాల సరిహద్దు గా మారిందంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక్కడ ప్రజలందరూ కలిసి కట్టుగానే ఉంటారు. సంబరాలు పండుగలు కలిసిమెలిసి నిర్వహించుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే బయట వ్యక్తులు వస్తే ఇవి రెండు రాష్ట్రాల నడుమ రెండు గ్రామాలుగా చెబితే తప్ప ఎవ్వరికి తెలియదు.
#instagramreels #foryou #instagram