గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును అడ్డుకున్న టిడ్కో కాలనీ వాసులు
గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రామును అడ్డుకున్న టిడ్కో కాలనీ వాసులు
టిడ్కో కాలనీలో మంచినీటి బోర్ల పనుల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ఎమ్మెల్యేను చుట్టుముట్టిన టిడ్కో కాలనీ వాసులు
2024 ఎన్నికల ప్రచారంలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే టిడ్కో ఇళ్ల లోన్లన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పిన వాగ్దానం .
ఏడాదిన్నర అయ్యింది ఎప్పుడు లోన్లు మాఫీ చేస్తారంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించిన టిడ్కో కాలనీ మహిళలు.
లోన్లు కట్టాలని బ్యాంకర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు.. బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు…
లోన్లు కట్టకపోతే అధికారులు మా ఇళ్లను జప్తు చేస్తామంటున్నారు.
తమకు ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని ఎమ్మెల్యేను ఇలాదీసిన మహిళలు.
ట్రై చేస్తున్నాను…టైమ్ పడుతుందని..ఇప్పటికిప్పడే చేయాలంటే చేయలేనన్న ఎమ్మెల్యే .
తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాల్సిందేనని పట్టుబట్టడంతో వెనుతిరిగి వెళ్ళిపోయిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.