గిరిజన తండా నుంచి ఐఐటీ, ఎంబీబీఎస్ వరకు…
గిరిజన తండా నుంచి ఐఐటీ, ఎంబీబీఎస్ వరకు – ఇద్దరు అక్కాచెల్లెళ్ల స్ఫూర్తిదాయక గమనం*
కలలు కన్న తండా, సాధించిన తారలు: గిరిజన సోదరీమణుల అరుదైన విజయం
ఒకే ఇంటి నుంచి ఎంబీబీఎస్, ఐఐటీ – గిరిజన యువతకు మార్గదర్శకులు
తండా పిల్లలు దేశానికే గర్వకారణం – చదువుతో చరిత్ర సృష్టించిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు
సంక్షోభాలనుండి శిఖరాలకు – గిరిజన కుటుంబం నుంచి వెలుగులోకి వచ్చిన విజేతలు…..
మట్టిలో మాణిక్యాలు గిరిజన బిడ్డలు, ఒకరు MBBS సిటు, మరొకరు IIT సిటు, *మట్టంపల్లి మండలం ఉమ్మడి భీల్యానాయక్ తండా కు చెందిన మాజీ సర్పంచ్ దారావత్, నాగమణి నవీన్ నాయక్ కు ఇద్దరు బిడ్డలు*, ఇద్దరు కూడా చదువులు తల్లులు చిన్నప్పటినుండే చదువులో రానిస్తు అందరి చేత శబాష్ అనిపించుకునే వారు మొదటి నుండి క్రమశిక్షణ ఉంటు *పెద్ద పాపా ధరవత్ స్పందన* 1 వ తరగతి నుండి 6 వ తరగతి వరకు హుజుర్ నగర్ క్రిష్ణ వేణి స్కూల్, ఆతరువాత 7 వాక్లాస్ నుండి 10 వ తరగతి వరకు green wood స్కూల్ చదివి పదవ తరగతిలో 10 GPA కు 10 సాధించి అప్పుడే అందరి మన్న నాలు పొంది..ఆ తరువాత ఇంటర్ చదువు కోసం హైదరాబాద్ లోని నాగోల్ శ్రీచైతన్య జూనియర్ కాలేజీ లో ఇంటర్ బైపీసీ పూర్తి చేసి ఇంటర్ ఫలితల్లో 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించి మరో మారు శబాష్ అనిపించుకున్నారు, అదేవిదంగా దేశం లోనే అత్యంత కఠిన మైన పరీక్ష ఐన NEET లో అర్హత సాధించి మొన్న వెలువడిన రిజల్ట్స్ లో Govt మెడికల్ కాలేజీ లో MBBS సిటు సాధించడం పట్ల ఆ తండా వాసులు గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..*2వ పాప పేరు, ధరవత్ అమృత* 1 వ తరగతి నుండి 6 వ తరగతి వరకు హుజుర్ నగర్ క్రిష్ణ వేణి టాలెంట్ స్కూల్ ఆ తరువాత green wood స్కూల్ 7 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదవి పబ్లిక్ పరీక్ష లో పదవ తరగతి లో 10 పాయింట్ల కు గాను 9.8 GPA సాధించి, ఆ తరువాత ఇంటర్ రంగారెడ్డి జిల్లా కోహెడ లో ఇంటర్ చేశారు పబ్లిక్ పరీక్ష లో ఇంటర్ నందు 1000 మార్కులకు గాను 976 మార్కులు సాధించి ఆ తరువాత భారతదేశం లోనే అత్యంత ప్రతిష్టమకమైన పరీక్ష ఐన JEE అడ్వాన్స్, JEE మెయిన్స్ పరీక్షలలో అర్హత సాధించి దేశం లోనే టాప్ 10 IIT ఝార్ఖండ్ రాష్ట్రములో ధన్ బాద్ IIT CSE నందు సిటు సాధించారు
జాతికే వన్నెతెచ్చిన గిరిజన ఆణిముత్యాలు..