తల స్నానం – పెరాలసిస్ స్ట్రోక్స్…
చాలామంది స్నానం చేసేటప్పుడు మనం సాధారణంగా ముందు తలకు నీళ్లు పోసుకుని తర్వాత శరీరానికి పోసుకుంటాము..
కాని అది సరి కాదు అని కెనడా వైద్యుల బృందం పరిశోధన తెలుపుతుంది…
ముందు కాళ్ల మీద నీళ్లు పోసుకుని తరువాత శరీరం మీద నీళ్లు పోసుకుని ఆఖరిలో తలకు స్నానం చేయాలి అని కొత్త పరిశోధన తెలుపుతుంది..
మన శరీరంలో ఒక రకమైన టెంపరేచర్ మెయింటెన్ అవుతూ ఉంటుంది.. మనం తలపైన నీళ్లు పోసుకోవడం వలన అక్కడికి వెంటనే బ్లడ్ సప్లై పెరిగిపోయి రక్తనాళాలు చిట్లి స్ట్రోక్స్ వస్తున్నాయట..
ముఖ్యంగా పెద్ద వయసు వారు రక్తపోటు ఉన్నవారు మరియు కొలెస్ట్రాల్ లాంటి గుండె జబ్బులు ఉన్నవాళ్లు గుండె సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఇటువంటి స్ట్రోక్స్ కు గురి అయి బాత్రూంలో కింద పడి చనిపోతున్నారు..
కావున సరైన పద్ధతిలో స్నానం చేయడం అనేది కూడా చాలా ముఖ్యం అని ఈ పరిశోధన వలన తెలుస్తుంది..
డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు