ఏ బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిది…


అందరూ ఒకే రకం ధాన్యాలు తినడం కాదు అండి. వారి వారి ఆరోగ్య పరిస్థితి ప్రకారం ఏ రకం ధాన్యం తినాలో, ఎలా తీసుకోవాలో అని మన పూర్వీకులు ముందుగానే సూచించారు.

కానీ మనం ఆ జ్ఞానాన్ని విస్మరించి, ఒకే రకం ధాన్యం మాత్రమే తీసుకుంటూ, ఎంత ఎక్కువ పాలిష్ చేస్తే అంత మంచిదని భావించి, చివరికి తెల్లగా మారిన స్టార్చ్ మాత్రమే తింటున్నాం.

ఈ తరం మరచిపోతున్న మన దేశ వాలి ధాన్యం, వాటి అపూర్వ రకాలు మరియు ఉపయోగాలు మళ్లీ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను.
చాలా విలువైన సమాచారం పూర్తిగా చదవండి నలుగురికి షేర్ చేయండి….

*1. రక్తశాలి:*
రక్తశాలి >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు.
ఈ ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది.అత్యంత పోషక విలువలు, ఔషధ మూలికా విలువలు కలిగినది. ఆయుర్వేదలో వాతము పిత్తము కఫము నివారించును అని మరియు మూడు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము నాటిది అని చెప్పబదినది. ఈ ధాన్యాన్ని ఎర్రసాలి,చెన్నేల్లు,రక్తాసలి అని కూడా అంటారు. ఎరుపు రకాల్లో ఇది అమృత తుల్యమైన ధాన్యం.

*2. కర్పూకవుని:*
కర్పూకౌవుని >నలుపు> పొడవురకము> పంటకాలం>110 నుండి120 రోజులు.
ఈ ధాన్యం నలుపు రంగులో ఉంటుంది.బరువు తగ్గుటకు అనువైన ఆహారము. కొలెస్ట్రాల్ తగ్గుటకు, క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది. ఈ రైస్ను యాంటీ ఏజింగ్ రైస్ అని కూడా అంటారు.

*3. కుళ్లాకార్:*
కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>110 నుండి115 రోజులు.
ఈ ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది.గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది. పిల్లలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రైస్లో మాంగనీసు,విటమిన్ బి6,కాల్షియం, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్ ,పొటాషియం ,ఫైబర్ అధికంగా ఉంటాయి.

*4. పుంగార్:*
పుంగార్ >ఎరుపు >లావురకం> పంటకాలం>95 నుండి115 రోజులు.
ఈ ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది. అధిక పోషకాలు,ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. ఆకలిని కూడా ప్రేరేపిస్తుంది. శరీరానికి బలాన్ని ఇస్తుంది. గర్భాధారణ సమయంలో తీసుకుంటే సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది. ఇది100% మహిళలకు మంచిది.

*5. మైసూర్ మల్లిగ:*
మైసూర్ మల్లిగ >తెలుపు>సన్నరకము> పంటకాలం>110 నుంచి 120 రోజులు.
ఈ ధాన్యం తెలుపు రంగులో ఉంటుంది. ఎదిగే పిల్లలకు అవసరమైన అధిక పోషకాలు, ప్రోటీన్స్ లభించే గుణం కలిగి ఉంది. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పిల్లలకు ఈ బియ్యంతో అన్నం చేసి పెట్టడం చాలా అవసరం.

*6.కుజిపాటలియా,సన్నజాజులు, చింతలూరు సన్నాలు,సిద్ధ సన్నాలు:*
కుజీపటాలీయా >తెలుపు>సన్నరకము> పంటకాలం>120 నుండి 125రోజులు.
ఇవి తెలుపు, సన్న రకాలు.ఈ బియ్యం కొవ్వు రహితం, సోడియం లేనివి. తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. గ్లూకోజ్ పదార్థాలు తక్కువగా ఉంటాయి, రోగనిరోధకశక్తి పెరగడానికి తోడ్పడతాయి.

*7. రత్నచోడి:*
రత్నచోడి > తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి135 రోజులు.
ఈ ధాన్యం తెలుపు,సన్నరకం అధిక పోషక విలువలు ఉన్నాయి. కండపుష్టికి, శరీర సమతుల్యతకు ఉపయోగపడుతుంది. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా వాడేవారు.రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

*8.బహురూపి,గురుమట్టియా,వెదురు సన్నాలు:*
తెలుపు,లావు రకం ఈ బియ్యంలో అధిక పోషకాలు,పీచు పదార్థంలు కలిగి ఉంటాయి. కాల్షియం,ఐరన్,జింకు ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతాయి. బహురూపి శ్రీకృష్ణదేవరాయల వారు కూడా తినేవారు.రోగనిరోధకశక్తి పెరగడానికి సహాయపడుతాయి.

*9. నారాయణ కామిని:*
నారాయణ కామిని >తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి140 రోజులు.
ఈ ధాన్యం తెలుపు, సన్న రకము .ఇందులో అధిక పోషకాలు, పీచుపదార్థాలు,కాల్షియం ఎక్కువగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

*10. ఘని:*
ఘని >తెలుపు>పొట్టిరకం>పంటకాలం> 125 నుండి 130 రోజులు.
ఈ ధాన్యం తెలుపు, చిన్న గింజ రకం. అధిక పోషకాలు కాల్షియం ఐరన్ ఎక్కువ. శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది.వర్షా కాలమునకు ఇది అనువైన విత్తనం.చేను పై గాలికి పడిపోదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

*11. ఇంద్రాణి:*
ఇంద్రాణి >తెలుపు>సన్నరకం>పంటకాలం> 120 నుండి 125 రోజులు.
ఈ ధాన్యం తెలుపు,సన్నరకం, సెంటెడ్ రకము. కాల్షియం,ఐరన్,D విటమిన్ ఎక్కువగా ఉంటుంది.పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.పెద్దవాళ్లు కూడా తినవచ్చు. గుల్ల బారిన(బోలు)ఎముకలు దృఢముగా మారడానికి సహాయపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

*12. ఇల్లపు సాంబ:*
ఇల్లపుసాంబ > తెలుపు> సన్నరకం> వంటకాలం>140 నుండి145 రోజులు.
ఈ ధాన్యం తెలుపు, సన్నరకం. ఇది మైగ్రేన్ సమస్యలను,సైనస్ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Dr.Venkatesh 9392857411

About The Author