సౌండ్ రావాలి… విద్యుత్ వాహనాలకు కేంద్రం కొత్త నిబంధన…


సౌండ్ రావాలి… విద్యుత్ వాహనాలకు కేంద్రం కొత్త నిబంధన
నిశ్శబ్దంగా నడిచే ఈవీలకు సౌండ్ సిస్టమ్ తప్పనిసరి
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు
2027 అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధన కఠినంగా అమలు

అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు వర్తింపు

వాహన వేగాన్ని బట్టి మారనున్న కృత్రిమ శబ్దం

ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర రవాణా శాఖ

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వల్ల పొంచి ఉన్న నిశ్శబ్దప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈవీల నుంచి కూడా శబ్దం వచ్చేలా ‘అకౌస్టిక్ వెహికల్అలర్ట్సిస్టమ్’ (AVAS)నుతప్పనిసరిచేస్తూకీలకనిర్ణయంతీసుకుంది. రోడ్డు భద్రతను పెంచే లక్ష్యంతో ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురానుంది.కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖఈమేరకుఒకముసాయిదానోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం, 2027 అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని రకాల ఎలక్ట్రిక్కార్లు,బస్సులు,ట్రక్కులకు ఈ సౌండ్ అలర్ట్ సిస్టమ్ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా, 2026 అక్టోబర్ 1 తర్వాత తయారయ్యే కొత్త మోడల్ వాహనాల్లో ఈ వ్యవస్థను తప్పనిసరిగా అమర్చాలని స్పష్టం చేసింది.

About The Author