బందరు రైల్వే ప్రయాణికుల ఇబ్బందులు పరిష్కరించాలి…


మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకి శెట్టి బాలాజీ డిమాండ్….
సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మచిలీపట్నం రైల్వే ప్రయాణికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు. మంగళవారం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నం రైల్వే స్టేషన్ వసతుల లేమితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాలాజీ అన్నారు. గత రెండు సంవత్సరాలుగా మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో లిఫ్టు సదుపాయం లేకపోవడం వలన వృద్ధులు మహిళలు లగేజితో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో ఎంపీ బాల సౌరి తన నిధులనుండి 50 లక్షలు లిఫ్టు కోసం ప్రకటించిన నేటికీ అది కార్యరూపం దాల్చకపోవడం బాధాకరమని బాలాజీ అన్నారు. విశాఖపట్నం ప్రయాణికుల కష్టాలు వెళ్లే వారికి, వచ్చే వారికి ఎక్కువగా ఉన్నాయని బాలాజీ అన్నారు. విశాఖపట్నం నుండి మచిలీపట్నం వచ్చే రైలను ప్రతి రోజు గుడివాడలో గంటకు పైగా నిలిపివేయటం ఎంతవరకు సమంజసం అని బాలాజీ ప్రశ్నించారు. మచిపట్నంలో ఒకటవ ప్లాట్ఫారం ఖాళీగా ఉన్న దానిని ఉపయోగించుకోకుండా వైజాగ్ ట్రైన్ మూడో నెంబర్ లో ఆపడం వలన ప్రయాణికులు మెట్లు ఎక్కటం దిగడం చేయలేక రైల్ ట్రాక్ మీద అడ్డంగా బయటకు వస్తున్నారని బాలాజీ అన్నారు. అర్ధరాత్రి పూట వచ్చే రైలులో పోలీస్ పహార లేకపోవడం వల్ల ప్రయాణికులు మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని బాలాజీ అన్నారు. మచిలీపట్నం నుండి తిరుపతి కు ప్రతిరోజు ఉండే రైలును ఎంతో రద్దీగా ఉన్నా సరే రద్దు పరచటం హిందువుల మరియు రైల్వే ప్రయాణికుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బాలాజీ ఆరోపించారు. మచిలీపట్నం తిరుపతి రైలు నాలుగు నియోజకవర్గ ప్రజలకు ఎంతో అందుబాటులో ఉండే ట్రైన్ అని బాలాజీ అన్నారు. మచిలీపట్నం నుండి ముంబై కు ట్రైన్ ఎంతోకాలంగా మంజూరు కాకుండా పెండింగ్ లో ఉందని ముంబై ట్రైన్ కోసం ఎంపీ బాలసోరి రైల్వే మంత్రి తో మాట్లాడి కృషి చేయాలని బాలాజీ సూచించారు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మచిలీపట్నం నుండి విజయవాడకు ప్రతి రెండు గంటలకు టూ స్టాప్ రైలు ఏర్పాటు చేసి రైల్వే ప్రయాణికులకు వెసులుబాటు కల్పించాలని బాలాజీ సూచించారు. కోట్లు ఖర్చుపెట్టి డబుల్ ట్రాక్ వేసిన రైళ్లను నిలిపివేయటం అధికారుల నిర్లక్ష్యంగా ఉందని బాలాజీ అన్నారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ సదుపాయం ఏర్పాటు చేయాలని బాలాజీ డిమాండ్ చేశారు.

About The Author