ముద్ర లోన్ విజయ గాధ !!
ముద్ర విజయ గాధ !!
ఇదిచదివినతరువాతనీకళ్ళవెంటఆనందభాష్పాలురాలతాయనీవుస్పంధించేవాడివైతే!!
అరుల్ మోజీ శరవణన్,తమిళనాడుకి చెందిన సామాన్య మహిళ,తానూ ఎంతో కొంత సంపాదించి కుటుంబానికి చేదోడుగా ఉందామని అనుకున్నప్పుడు ప్రధాని ముద్రా యోజన ప్రకటించడం,ఆమె దానికి దరఖాస్తు చేసుకుని బ్యాంక్ రుణం పొందడం జరిగింది.ప్రభుత్వ కార్యాలయాలకు కావలసిన చిన్న వస్తువులను సరఫరా చేసే వ్యాపారం ప్రారంభించి మహిళా వ్యాపార వేత్తగా మారింది.ఈ లోపు కేంద్ర ప్రభుత్వం తమ కార్యాలయాల్లో కావలసిన చిన్న చిన్న వస్తువుల్ని చిన్న చిన్న వ్యాపారస్థుల దగ్గరే కొనాలనే ఉద్దేశ్యంతో Government e- Market place GeM అనే ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తే దానిలో సప్లయర్ కింద రిజిస్టర్ అయ్యింది,2017 లో ఒకరోజు ప్రధాని కార్యాలయానికి థెర్మో Flask కావాలని ఆ సైట్ లో పెట్టిన విషయం చూసి నేను సరఫరా చేస్తాను అని apply చేసింది.ప్రధాని కార్యాలయం ఆమె ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ఆ ఆర్డర్ ఆమెకే ఇవ్వడం,ఆమె సరఫరా చేయడంతో ఆమెలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగి వ్యాపారం మరింత అభివృద్ధి చేసుకోగలిగారు.
ఈ విషయాన్ని ఆమె మొత్తం ఒక లేఖలో వివరించి ప్రధాని కార్యాలయానికి రాస్తే ప్రధాని మోడీ తన మాన్ కి బాత్ లో ప్రస్తావించడంతో ఆమెకి మరింత ప్రాచుర్యం వచ్చింది.వ్యాపారం పరిధి మరింత పెరిగింది..
ఆ తర్వాత ఏ ఈమధ్య మరలా ఆమె ప్రధానికి తన వ్యాపారం పరిమాణం కోటి రూపాయలకు పెరగడం గురించి,కట్టెల పొయ్యినుండి గ్యాస్ కి మారిన తమ ఇంటి ప్రగతి,త్వరలో గ్యాస్ సబ్సిడీ వదులుకుంటామని,అలాగే సొంత ఇంటి కోసం బ్యాంక్ లోన్ కై ప్రయత్నిస్తున్నాం అని వివరిస్తూ రాసిన ఆ లేఖ ప్రధాని మోడీ ని కదిలించింది, అందుకే ఆయన నిన్న మదురై వెళ్ళినపుడు ఆమె కోరిక మేరకు కలిసి అభినందించారు.GeM ద్వారా తనలాంటి చిన్న వ్యాపారస్థులకు ఎంత మేలు కలుగుతుందో ఆమె వివరిస్తే ఆయన ఆనంద పడ్డారు..
ఆమె ప్రధానికి రాసే ప్రతి ఉత్తరంలో మోడీని #అప్పా (తండ్రి) అని సంబోధిస్తారు ఎందుకని అడిగిన విలేఖరులకు ఆమె ఇచ్చిన సమాధానం..తమ లాంటి చిన్న వాళ్ళకే ప్రాధాన్యం ఇవ్వాలనే GeM లాంటి సంస్కరణ తండ్రి లాంటి వ్యక్తి కాక ఇంకెవరు చేస్తారని..
ఇది రాస్తుంటే నా కళ్లలో ఆనందంతో కూడిన తడి..ఇలాంటి ఎన్నో చిన్న సంస్కరణలతో ప్రభుత్వాన్ని పేదల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా చేసిన వ్యక్తి నా ప్రధాని,మన మోడీ అని తలుచుకుంటే గర్వంగా ఉంది!!