కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు సంచలన నిర్ణయం…
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు సంచలన నిర్ణయం తీసుకుంది… తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు బంధు పేరుతో పంటకు రూ. 4 వేల చొప్పున ఏడాదికి రూ. 8 వేలు ఇస్తుండగా… ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర రైతు బంధుపథకం రూ.6 వేలుగా నిర్ణయించారు. 2 హెక్టార్లు (5 ఎకరాలు) భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలచొప్పున ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి నిధులను కేంద్రమే భరిస్తోందని పీయూష్ గోయల్ ప్రకటించారు. రూ.2 వేల చొప్పున… మూడు వాయిదాలుగా రూ.6 వేలు చెల్లిస్తారు.