యాదాద్రి ప్రారంభోత్సవానికి 133 దేశాల నుంచి వైష్ణవ పండితులు…
యాదాద్రి ప్రారంభోత్సవానికి 133 దేశాల నుంచి వైష్ణవ పండితులు
యాదాద్రి: యాదాద్రి క్షేత్రం సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైందని సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఓ అద్భుత క్షేత్రంగా ఖ్యాతిగాంచింది. యాదాద్రి ఆలయం దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది. వెయ్యి ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మాణం జరుగుతోంది. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిత్యాన్నదాన సత్రం నిర్మాణానికి రూ.10కోట్లు విరాళాలు వచ్చాయి. ఉత్తరభాగంలో ఆలయం కిందివైపు భూమిని సేకరించడం జరిగింది. స్థలసేకరణకు రూ.70కోట్లు విడుదల చేస్తున్నాం. నిత్యాన్నదాన సత్రాలు, బస్‌స్టేషన్, ఇతర నిర్మాణాలు చేపడుతాం. ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ నిర్మాణం సాగుతోందని కేసీఆర్ చెప్పారు.
యదాద్రి ప్రపంచంలోనే యూనిక్ టెంపుల్. ఏడంతస్తుల గోపురం కూడా శిల్పాలతోనే కట్టాం. ఆలయాలు ఒక తరం నుంచి మరో తరానికి సంస్కృతిని, సంస్కారాన్ని అందిస్తాయి. 250 ఎకరాల్లో 350 క్వార్టర్ల నిర్మాణం చేస్తాం. క్వార్టర్ల నిర్మాణానికి 43 మంది దాతలు ముందుకు వచ్చారు. గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. 50 ఎకరాల్లో ప్రవచన మంటపం నిర్మిస్తాం. మరో పది పదిహేను రోజుల్లో మళ్లీ యాదాద్రికి వస్తా. యాదాద్రి క్షేత్రానికి చాలా విశిష్టత ఉంది. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి 133 దేశాల నుంచి వైష్ణవ పండితులు వస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆలంపూర్ ఒకటి. గత పాలకులు జోగులాంబ శక్తిపీఠాన్ని పట్టించుకోలేదని సీఎం వ్యాఖ్యానించారు.