జ్యుడీషియల్ కాంప్లెక్స్ భవనం విశేషాలివి..
https://www.youtube.com/watch?v=4-VgHI3H0aE
జ్యుడీషియల్ కాంప్లెక్స్ భవనం విశేషాలివి..
* స్థలం విస్తీర్ణం: 4.02 ఎకరాలు
* మొత్తం నిర్మిత ప్రాంతం: 2.5 లక్షల చ.అడుగులు
* పార్కింగ్: 400 కార్లు నిలిపేందుకు వీలుగా..
* కోర్టు హాళ్లు: 23 (చీఫ్‌జస్టిస్ కోర్టు హాల్‌తో కలిపి)
* చీఫ్‌జస్టిస్ కోర్టు హాల్, జడ్జి చాంబర్ వైశాల్యం: 2480 చ.అడుగులు
* ఇతర కోర్టు హాళ్లు, జడ్జి ఛాంబర్ల వైశాల్యం (ఒక్కొక్కటి): 1240 చ.అడుగులు.
* న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు ప్రవేశించేందుకు వేర్వేరు మార్గాలు.
* పరిపాలన వసతులు (సెక్షన్లు, రిజిస్ట్రీలు)
* అడ్వొకేట్స్ అసోసియేషన్ హాలు.మహిళా న్యాయవాదులకు ప్రత్యేక అసోసియేషన్ హాలు
* అడ్వొకేట్ చాంబర్
* ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రం
* హైకోర్టు లైబ్రరీ
* భవనానికి ఎదురుగా ఐదెకరాల్లో ఉద్యానవనం
* భవనం గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి అంతస్తుల్లో అడ్వొకేట్ జనరల్ కార్యాలయం ఉంటుంది. అదనపు అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ప్రత్యేక ఛాంబర్లు. ప్రభుత్వ న్యాయవాదులకు 21 కేబిన్లు ఉంటాయి.
* కారిడార్లలో తప్ప భవనంలో అన్ని చోట్లా ఎయిర్‌కండీషన్ సదుపాయం.
* రెండున్నర లక్షల దస్త్రాల్ని భద్రపరిచేలా ఆధునిక స్టోరేజి సదుపాయం.
* 500 మంది ఒకేసారి భోజనం చేసేందుకువీలుగా క్యాంటీన్ సదుపాయం (నిర్మాణం మొదలైంది).
* కోర్టు భవనంలో బ్యాంకు, తపాలా విభాగాలు. న్యాయశాస్త్ర సంబంధిత పుస్తకాల విక్రయ కేంద్రం.
* మొత్తం భవనానికి 12 లిఫ్ట్‌లు.