నాని చిత్రంలో ఆర్ ఎక్స్ హీరో…!!

నాని చిత్రంలో ఆర్ ఎక్స్ హీరో!!

పక్కింటి కుర్రాడి పాత్రలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరై నాచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. అయితే ప్రస్తుతం ఆ శైలికి విభిన్నంగా తన తదుపరి చిత్రాలను ఎంచుకుంటూ వెళ్తున్నాడు నాని. ఇందులో భాగంగానే `దేవదాసు` చిత్రంలో డాక్టర్ గా నటించి మెప్పించాడు నాచురల్ స్టార్. ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్ అయిన `జెర్సీ` లో మధ్య వయస్కుడైన క్రికెటర్ గా క్యారక్టర్ లో కనిపించి అలరించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి పేరొచ్చింది.

ఇక కె.విక్రమ్ కుమార్ దర్శతక్వంలో నాని ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నానికి 24వ చిత్రం. అయితే ఈ చిత్రంలో నాని ఓ విభిన్న మైన పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. అదేమిటంటే….నాని నవలా రచయితగా నటిస్తున్నాడట. స్టోరీ ప్రకారం …ఒక మంచి నవల రాసి గొప్ప పేరు తెచ్చుకోవాలని హీరో కలలు కంటుంటాడట. ఈ క్రమంలో ఆరేడు నవలు రాసిన తర్వాత కూడా తనకు సరైన గుర్తింపు రాకపోవడంతో నిరాశకు గురైన అతణ్ని ఓ టీమ్ కలిసి కథానాయకుడి హెల్ప్ కోరుతుందట. ఆ తర్వాత ఆసక్తికరమైన మలుపు తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 చిత్రంతో నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న కార్తికేయ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్తికేయ హిప్పీ తో పాటు మరో చిత్రంలో నటిస్తున్నాడు. మరి కె.విక్రమ్ కుమార్ చిత్రంలో కార్తికేయ నటించనున్నాడన్న వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

About The Author