బ్రేకింగ్ న్యూస్: కేంద్రం కీలక ఆదేశాలు : బోర్డర్ కు విమానాల్లోనే బలగాల తరలింపు…

బ్రేకింగ్ కేంద్రం కీలక ఆదేశాలు : బోర్డర్ కు విమానాల్లోనే బలగాల తరలింపు.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. అన్ని రకాల కేంద్ర సాయుధ బలగాలను ఇకపై ఢిల్లీ-శ్రీనగర్, శ్రీనగర్-ఢిల్లీ,జమ్మూ-శ్రీనగర్,శ్రీనగర్-జమ్మూ రూట్లలో వాయు మార్గంలో తరలించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

గురువారం(ఫిబ్రవరి-21,2019) కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలతో ఇకపై విధినిర్వహణలో భాగంగా ప్రయాణాలు, సెలవుపై ప్రయాణాల్లో కూడా ఇది వర్తిస్తుంది. అంటే జమ్మూకాశ్మీర్ విధుల్లో ఉన్న సిబ్బంది సెలవుపై ఇంటికి వెళ్లే సమయంలో కూడా విమాన ప్రయాణం చేయవచ్చు.

కేంద్ర హోంశాఖ తీసుకొన్న నిర్ణయం ద్వారా 7లక్షల80వేల మంది సీఆర్పీఎప్ సిబ్బంది లబ్ధి పొందనున్నారు. ఇప్పటివరకూ కానిస్టేబుల్,హెడ్ కానిస్టేబుల్,అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ ర్యాంకు సిబ్బందికి విమాన ప్రయాణాలకు అనుమతి లేదు.హోంమంత్రిత్వ శాఖ తెలిపిన మార్గాల్లో వైమానిక సేవలను కూడా ప్రభుత్వం క్రమంగా పెంచనుంది. ఈ నిర్ణయంతో జవాన్ల ప్రయాణసమయం బాగా తగ్గిపోతుంది.

About The Author