అమరావతి లోని తాడేపల్లి లో జగన్మోహన్ రెడ్డి నూతన గృహ సముదాయాలలోకి …
అమరావతి లోని తాడేపల్లి లో రెండెకరాల సువిశాల ప్రదేశంలో నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయం, నూతన గృహ సముదాయాలలోకి ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి ఉదయం 08:19నిలకు సర్వమత ప్రార్ధనల అనంతరం కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలతో కలిసి గృహప్రవేశం చేసారు.
అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి…. ప్రతిపక్షనేత జగన్ ప్యాలెస్ లలో తప్ప బయట ఉండరని, బెంళూరు, లోటస్ పాండ్ లలోని ప్యాలెస్ ల తర్వాత ఇక్కడ కూడా ఓ ప్యాలెస్ ను నిర్మించుకున్నాకే వచ్చారని, పేదల సమస్యలు ప్రతిపక్షానికి పట్టవని, వైసీపీ ధనిక వర్గాల పార్టీ అంటూ తీవ్ర విమర్శలు చేసారు.
ప్రతిపక్ష నేత గృహ ప్రవేశ కార్యక్రమానికి తల్లి విజయమ్మ, సతీమణి భారతి, కుటుంబ సభ్యులు షర్మిల, అనిల్ తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జులు పాల్గొన్నారు.