సిద్ధిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

సిద్ధిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం.

– మీరంతా జర్నలిస్టులే కాదు, నన్ను గెలిపించిన నా ఓటర్లు.
– ప్రెస్ క్లబ్ స్థలం చాలా విలువైంది. అందరికి ఉపయోగపడే విధంగా కృషి చేయాలి, ఇందుకు నా వంతు పూర్తి సహకారం ఉంటుంది.
– జర్నలిస్ట్ అంటే ఒక సామాజిక గౌరవం ఉంది.
-కానీ వారి జీవితాల్లో బాధ ఉందని చెప్పుకొచ్చారు.
-సమాజానికి మీరంతా గొప్ప సేవ చేస్తారని, మీకు ఓ సమయం, ఒక రోజు అనేది ఉండదని, పండుగ రోజున కూడ పని చేస్తారంటూ.. మీరిచ్చే ఒక వార్త సమాజ మార్పు.
– మీరిచ్చిన ఒక వార్త విప్లవాత్మక మార్పు కలిగిస్తుంది.
– దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్ట్ సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని వెల్లడి.
– అనేక ప్రాంతాలలో వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
-మన రాష్ట్రంలో జర్నలిస్టుల సంఖ్య అధికంగా ఉన్నదని, జర్నలిస్టు బస్సు పాసులు, ఇళ్లు, వైద్యం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది.

– సిద్ధిపేటలో ఆక్సిజన్ పార్కు రావడానికి దిన పత్రికల కథనాలే స్ఫూర్తిగా తీసుకున్నట్లు అభిప్రాయం చెప్పారు.
– దిన పత్రికలో వచ్చే వార్తలు ఓ వ్యక్తి, ప్రభుత్వ అధికారి.. ఇలా అందరిని ప్రభావితం చేస్తాయని చెప్పుకొచ్చారు.
– హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, ఓడీఎఫ్., ప్లాస్టిక్ ఇలా అన్నింటా దిన పత్రికల పాత్ర ముఖ్యం.
– సమాజంలో ఒక మంచి మార్పుకు జర్నలిస్టులే కృషి చేస్తున్నారని., ఒక మంచి పని చేయాలనే భావన రావాలని కోరి., పది మంది మంచి కోసం పని చేద్దాం. మనమంతా కలిసి నడుద్దాం ఒక మంచి సమాజం నిర్మాణం చేద్దాం.

– మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి పంచాయతీ వ్యవస్థ కోసం కొత్త పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి చెందేలా కొత్త మార్పులు తేవాలని ఆశిస్తున్నట్లు చెబుతూ.. మంచిని ప్రోత్సహించి ఇదే ఒక మొదటి నాందిగా నిలిచేలా మీరు నిర్వర్తించాల్సిన పాత్రను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు.
– మంచిగా పనిచేస్తున్న అధికారిని ప్రోత్సహిద్దామని., సమాజ అభివృద్ధి కోసం కృషి చేసిన వారిని గుర్తిద్దమని., విమర్శల కథనాలతో పాటు మంచిని గుర్తిద్దామని పిలుపునిచ్చారు.
-అన్నీ రంగాల్లో సిద్ధిపేట ఆదర్శంగా నిలిచింది ఇది మీ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
– జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయం రూ.35 కోట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. జర్నలిస్టుల బాగు కోసం సర్కార్ కృషితో సాగుతుంది. ఇళ్ల స్థలాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు.

– త్వరలోనే జర్నలిస్టులకు ఒక మంచి పాలసీ రానున్నది.

– గ్రామీణ ప్రాంత యువతను ముందుకు తీసుకువెళ్దాం.

-యువ శక్తిని సమాజానికి అవసరం అయ్యే విధంగా చూద్దాం. యువత శక్తి నిర్వీర్యం కాకుండా చూడాలి.

– యువతలో కష్టపడే తత్వం తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. స్ఫూర్తి కలిగించేలా యువత గురించి ప్రత్యేక కథనాలు రాయండి.

– సామాజిక బాధ్యతను జర్నలిస్టు కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని సాగాలని, ఆ సామాజిక దృక్పథం వైపు సాగుదామని కోరారు.

– ఇదోక ఒక ప్రయత్నం జరిగితే ఏదైనా మనకు సాధ్యమే.

– సమాజ రుగ్మతలను నిర్మూలించే దిశగా నడవాలి.

– దేశ జవానుల త్యాగం గొప్పది.

-శత్రు స్థావరాలను నాశనం చేసిన పైలెట్ స్ఫూర్తి గొప్పది.

-త్యాగాల ముందు మన చేసే ప్రయత్నం చిన్నదే.

– సమాజం బాగు చేయడం ఒక్క వ్యక్తి వల్ల కాదు. ఆ ఆలోచన అందరిలో రావాలని, ఆ ఒక్క మార్పు కోసం సమయం ఇవాళ వచ్చిందని చెప్పారు.

– ప్రజలు, ప్రజా స్వామ్యం ముఖ్యమని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని., జర్నలిస్టు అంటే.. ఒక శక్తి., ఆ శక్తిని మీరు ఇచ్చే వార్తా కథనాలు ఇవ్వాలని సమాజంలో మార్పు కోసం ఓ శక్తిలా పని చేయాలని జర్నలిస్టులను కోరారు.

About The Author