శివలింగం – అభిషేకం – వైజ్ఞానికం…

శివలింగం – అభిషేకం – వైజ్ఞానికం

శివలింగాన్ని మనం చూసినట్లయితే వృత్త, దీర్ఘవృత్త, శంఖాకారాలలోఏదో ఒకటిని కలిగి ఉంటుంది.
మనం నివసించే భూమికూడా వృత్తాకారాన్నే కలిగివుంది.
భూమి ఏవిధంగా అయితే ఆకర్షణ శక్తి కలిగియుంటుందో, శివలింగం కూడా దానికంటే గొప్పదైన ఆకర్షణ కలిగిఉంటుంది.
పరస్పర సంబంధాన్నిబట్టి, భూమి శివలింగంతోసమానమని నిరూపణ చేస్తోంది. దీనికి ఉదాహరణగ శంకరుడు విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇచ్చే వృత్తాంతమే.

అణుశాస్త్ర ప్రకారం శివలింగం ఆల్ఫా(ALPHA), గామా(GAMA),బీటా(BETA) మొదలగు కాంతి జనకాలను కలిగియుంటుంది. జీవులలో రేడియం అనే శక్తి ఉంటుంది. కాంతిజనకాన్ని, రేడియం అనే పదార్థంమీద ప్రకాశింపచేసినపుడు – విద్యుత్ బల్బు వెలిగినట్లు, రేడియం ఒక కాంతిని ప్రసరింపచేస్తుంది.
అదేవిధంగా మనిషి శివలింగాన్ని దర్శించేటప్పుడు మనిషిలోని రేడియం ACTIVATE అయి శివలింగంలో ఉన్న కాంతిజనకాలను ఆకర్షిస్తుంది. తద్వారా ఒక రకమైన ఆనందానుభూతి కలిగిన వెలుగును మనం పొందుతాం. శివలింగం సాధారణంగా రాతితో చేయబడి ఉంటుంది. అంటే ఇది కాల్షియం కార్బనేట్ అయి ఉంటుంది.

వివరణ :-
కాల్షియం కార్బొనేట్ + హైడ్రోక్లోరిక్ ఆమ్లం —> కాల్షియం క్లోరైడ్ + నీరు + కార్బన్ డయాక్సైడ్.

CaCO3 + 2HCl —> CaCl2 + H2O + CO2

భూమి సజల నైత్రికామ్లాన్ని కలిగియుంటుంది. అదే విధంగా శివలింగం కూడా స్వల్పజింక్ ను కలిగి వుంటుంది. అందుచేత శివలింగానికి అభిషేకం చేసినపుడు పాలు మొదలగు ద్రవ్యములు శివలింగంపై పోసిన తరువాత దానిపై నుండి భూమి మీదకు జారిపడి, దాని పరిమాణంకంటే ఎక్కువ మోతాదులో వాసనలను విస్తరింప చేస్తుంది.

మెగ్నీషియం + నైత్రికామ్లం —> మెగ్నీషియం నైట్రేట్ + హైడ్రోజన్.

Mg + 2HNO3 —> Mg (NO3)2 + H2

పై తెల్పిన చర్యల వలన ఆమ్లములు లోహముతో చర్య జరిపినపుడు హైడ్రోజన్ (అణుబాంబు) ఏర్పడుతుంది. కనుక దీనిని “స్వయంభూ లింగం” అంటారు.
మరికొన్ని శివాలయాల్లో మనం ప్రతిష్ఠా లింగములను చూస్తూవుంటాం. దాని విషయమేమంటే శివలింగానికి ఆధారంగా చెప్పబడ్డ ప్రాణాట్టం (ప్రాణః + ఆట్టం). దీనియందు గల వైజ్ఞానిక శాస్త్ర విషయం ఏమంటే ప్రాణాట్ట మధ్యస్థంలో గల వృత్త భాగం అధిక మోతాదులో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. మనం శివలింగం ప్రతిష్థ చేసినపుడు పాదరసం పోసి దానిపైన బాణం ఉంచుతాం. ఇలా చేసినపుడు ఆక్సిజన్ – పాదరసంతో సంయోగం చెంది అధిక ప్రాణవాయువు విడుదల చేస్తుంది. ఇదే వాయులింగం. ఈ ఏర్పడిన ప్రాణవాయువు గాలిలో గల ప్రోటాన్లను సేకరించి ఆక్సీప్రోటాన్లను ఏర్పరుస్తుంది. కనుకనే శివలింగానికి ఒక విధమైన ఆకర్షణశక్తితో కూడిన వెలుగును ప్రసరింపచేస్తుంది. ఇదియే ప్రాణప్రతిష్ఠ.
అణుశాస్త్రం ప్రకారం శివలింగం మండే అగ్నిగోళం. అగ్ని అంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు.
ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి = 9.109 x-25 గ్రాములుగా విస్తరింపబడుతుంది ఒక సెకనుకు. కాగా ఒక గంటలో ఒక శివలింగము 2550.52 ఎలక్ట్రానుల శక్తిని విడుదల చేస్తుంది. అగ్నిగోళాన్ని భరించాలంటే సమాన ఎలక్ట్రాన్ శక్తిని కలిగియుండాలి. కాని మానవులలో వేయివేల ఎలక్ట్రానుల శక్తి మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అందుచేత పూర్తిగా శివలింగపు శక్తిని భరించలేము. ఒక ఎలక్ట్రాను ఆవేశము = 1.602×10(power-19) Culumbs శక్తి కలిగియుంటుంది. ఇంతటి ఆవేశ శక్తిని మానవుడు భరించుటకు అంతకన్నా ఎక్కువ శక్తి అవసరమై ఉంటుంది. అంత శక్తి మానవునివద్ద లేదు కాబట్టి శివలింగంపై నీళ్ళుపోసి శివలింగంయొక్క ఎలక్ట్రాన్ ఆవేశక శక్తిని శాంతింప చేయవచ్చు. నీటియొక్క శక్తి 1498 కూలుమ్స్ కలిగి ఉంటుంది. అందుచేత మనం శివలింగానికి ఎక్కువ నీటితో అభిషేకం చేస్తూ ఉంటాం.
అయస్కాంత తత్త్వము, విద్యుచ్ఛక్తి, ధ్వని, ఆకాశాది విషయాలలో కూడ ఇటువంటి వైజ్ఞానిక విషయాలే ముడివడి యున్నాయి.
శివలింగంపైన ధారాపాత్రను వ్రేలాడదీసి, లింగాన్ని బిందుమాత్రమున నీటితో తడుపుతూంటారు. అట తడి ఆరినవేళ శివలింగము అణుబాంబయితే, మానవమేధ పరిపూర్ణ క్రోధస్థితినంది, మానవుడు పశుప్రాయుడై ఉచ్ఛ – నీచములను మరిచి పశుతుల్యుడై ద్విపాద పశువుగా చెప్పబడతాడు.
అందుకనే ప్రకృతిపరంగా పంచామృతాలతో అభిషేకాన్నీ , నమకం ద్వారా ఆ ప్రకృతిలోని పరమాత్మ చైతన్య శక్తినీ తెలియజేస్తూ, జ్ఞానస్వరూపుడైన పశుపతి మనలోని అజ్ఞానమనే పశుత్వాన్ని తొలగించి, మనలను జ్ఞానమార్గంలో – ఆయనని పొందేలాగు అనుగ్రహిస్తున్నాడు.

ॐ నమశ్శివాయః

About The Author