డేటా చోరీ పై దూకుడు పెంచిన సిట్…
డేటా చోరీ పై దూకుడు పెంచిన సిట్…
క్షణక్షణానికి మారుతున్న పరిస్థితులతో సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల నడుమ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన డేటా చౌర్యం కేసులో సీనియర్ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో… తెలంగాణ ఏర్పాటుచేసిన సిట్, దూకుడు పెంచింది.
టీడీపీ అగ్రనేతలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళావెంకట్రావు ఆధ్వర్యంలో గత రాత్రి గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు తెలంగాణ పోలీసులపై ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో… ఇటు తెలంగాణ సిట్ తన దర్యాప్తు ను ముమ్మరం చేసింది… ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలక వ్యక్తి, అజ్ఙాతంలో ఉన్న డేటా గ్రిడ్ ఎండీ అశోక్ ను పట్టుకొనేందుకు ఇప్పటికే ఏర్పాటు చేసిన మూడు టీం లకు అదనంగా మరో టీంను ఏర్పాటు చేసారు సిట్ అధిపతి, స్టీఫెన్ రవీంద్ర, అంతేకాక వివాదాస్పద డేటా నిక్షిప్తమై ఉన్న అమెజాన్, గూగుల్ సంస్థలు, ఆ డేటాను త్వరగా అందించాల్సిందిగా మరో లేఖ వ్రాసింది సిట్…
— స్రవంతీ చంద్ర